Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC and India Post: ఎల్ఐసీ బాండ్ వేగంగా పాలసీ హోల్డర్లకు చేర్చడానికి భారత పోస్టాఫీస్‌తో జతకలిసిన ఎల్ఐసీ

ఎల్ఐసీ పాలసీ తీసుకున్నవారికి పాలసీ బాండ్ అందడంలో తరచూ ఆలస్యం అవుతుండటం సహజం. ఒక్కోసారి పాలసీ బాండ్ అందటానికి నెలలు పట్టిన సందర్భాలూ వెలుగులోకి వచ్చాయి.

LIC and India Post: ఎల్ఐసీ బాండ్ వేగంగా పాలసీ హోల్డర్లకు చేర్చడానికి భారత పోస్టాఫీస్‌తో జతకలిసిన ఎల్ఐసీ
Lic And India Post
Follow us
KVD Varma

|

Updated on: Sep 29, 2021 | 5:14 PM

LIC and India Post: ఎల్ఐసీ పాలసీ తీసుకున్నవారికి పాలసీ బాండ్ అందడంలో తరచూ ఆలస్యం అవుతుండటం సహజం. ఒక్కోసారి పాలసీ బాండ్ అందటానికి నెలలు పట్టిన సందర్భాలూ వెలుగులోకి వచ్చాయి. ఇకపై అటువంటి ఇబ్బందులు ఎల్ఐసీ పాలసీలతో వచ్చే అవకాశం లేదు. ఈ మేరకు ఎల్ఐసీ(LIC) ఒక శుభవార్త తీసుకువచ్చింది. ఈ ఆలస్యాన్ని నివారించడానికి భారతీయ తపాలా శాఖ సహకారంతో ఎల్ఐసీ పాలసీలను అందించే ప్రయత్నం మొదలు పెట్టింది. దీని వలన ఎల్ఐసీ పాలసీ పత్రాలు చాలా వేగంగా డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఎల్ఐసీ- ఇండియా పోస్టాఫీస్ మధ్య ఒప్పందం జరిగింది.

ఇటీవల భారతీయ తపాలా శాఖ డిజిటలైజేషన్‌ను టెక్నాలజీని విలీనం చేసింది. దీని ద్వారా ‘ప్రింట్ టు పోస్ట్’ సేవను భారతీయ తపాలా శాఖ ప్రవేశపెట్టింది. ఈ సేవను ఇప్పుడు ఎల్ఐసీ కూడా ఉపయోగించుకుంటుంది. దీనికోసమే రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. పోస్ట్‌ల శాఖ ‘ప్రింట్ టు పోస్ట్’ సేవ ఇలా..

‘ప్రింట్ టు పోస్ట్’ సేవ కింద.. పోస్టల్ శాఖ స్వయంగా ప్రజల ఎల్ఐసీ పాలసీ పత్రాన్ని ముద్రించి వినియోగదారుల చిరునామాకు పంపుతుంది. ఇది పాలసీ పత్రాన్ని పొందడానికి ప్రజలు తీసుకునే సమయాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో, ఎల్ఐసీకి కూడా చాలా భారం తగ్గుతుంది. ఈ సేవను అందించినందుకు ప్రతిగా, ఇండియా పోస్ట్ ఆదాయం పొందుతుంది. ఈ విధంగా ఇది ఇద్దరికీ ‘విన్-విన్’ పరిస్థితి అవుతుంది.

ప్రభుత్వం ఒక ఐపీవో తీసుకురావడం ద్వారా ఎల్ఐసీ ని అతి త్వరలో స్టాక్ మార్కెట్‌లో జాబితా చేయబోతోంది. దేశ బీమా మార్కెట్‌లో ఎల్ఐసీకి అత్యధిక వాటా ఉంది. LIC 2020-21లో 2.1 కోట్లకు పైగా బీమా పాలసీలను జారీ చేసింది. దేశంలోని మొత్తం బీమా పాలసీలలో 75% ఎల్ఐసీ చేస్తుంది. కంపెనీ మార్చి 2021 లోనే దాదాపు 47 లక్షల బీమా పాలసీలను జారీ చేసింది.

ఇవి కూడా చదవండి: IPL 2021 SRH vs RR: ఒకరిది పోరాటం.. మరొకరిది ఆరాటం.. రసవత్తరమైన పోరును ఇలా చూడండి..

Pubji Love: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయిని పబ్జీ గేమ్‌ కలిపింది.. రహస్య వివాహం.. ఆ తర్వాత..

Skin Care: మీ శరీరం మీది అవాంఛిత రోమాలను ఒక్క రోజులో తొలగించుకొండి ఇలా..

పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
మెరిసే స్కిన్, సిల్కీ జుట్టు కోసం కలబందను ఇలా వాడి చూడండి..
మెరిసే స్కిన్, సిల్కీ జుట్టు కోసం కలబందను ఇలా వాడి చూడండి..
వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాయ్.. ఆ సూపర్ హిట్ ఎలా మిస్సైందంటే..
వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాయ్.. ఆ సూపర్ హిట్ ఎలా మిస్సైందంటే..
తిరుమలలో అనుమానాస్పదంగా సంచరించిన ముస్లిం వ్యక్తి..
తిరుమలలో అనుమానాస్పదంగా సంచరించిన ముస్లిం వ్యక్తి..
ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి.. ఎవరీ అధికారి?
ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి.. ఎవరీ అధికారి?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?