AJIO Offers: పండగ సీజన్‌లో AJIO గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ల ప్రకటన..
AJIO Offers: భారతదేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ ఈ-రిటెయిలర్ అజియో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4, 2021 వరకు బిగ్ బోల్డ్ సేల్‌ని ప్రకటించింది.

AJIO Offers: భారతదేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ ఈ-రిటెయిలర్ అజియో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4, 2021 వరకు బిగ్ బోల్డ్ సేల్‌ని ప్రకటించింది. దసరా నవరాత్రులు, బతుకమ్మ పండుగల సందర్భంగా వినియోగదారులకు బెస్ట్ ఫ్యాషన్, బ్రాండ్స్ అందించేందుకు సిద్ధమైంది. ఈ బిగ్ బోల్డ్ సేల్‌లో 2500+ బ్రాండ్స్‌కు చెందిన 6,00,000+ స్టైల్స్‌పై 50% -90% వరకు తగ్గింపు ఉంటుంది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రాండ్స్ ఈ ఆఫర్‌లో అతి తక్కువ ధరలో లభిస్తాయి. ప్రతీ గంటకు ఫ్లాష్ డీల్స్, కచ్చితమైన బహుమతులు, రివార్డులు, పాయింట్లు ఉంటాయి. సూపర్ డ్రై, స్టీవ్ మ్యాడెన్, ఆర్మాని ఎక్స్‌ఛేంజ్, అడిడాస్, లివైస్, నైకీ ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు సరసమైన ధరలలో దొరుకుతాయి. ప్రతీ రోజు 30 సెకన్ల పాటు ఉచితం, 60 సెకన్లలో సమాప్తం పేరుతో ఫ్లాష్ డీల్స్‌ను అజియో నిర్వహిస్తోంది.
టీ-షర్టులు, జీన్స్, స్నీకర్స్ వంటి చక్కని బహుమతుల శ్రేణి సహ విస్తృతస్థాయి కేటలాగ్‌ను అజియో 50 నుంచి 90% వరకు తగ్గింపు ధరల్లో అందిస్తోంది. అంతేకాదు చాలా కొత్త కొత్త బ్రాండులను ప్రవేశపెడుతోంది. పండుగ సందర్భంగా సామాన్య మధ్య తరగతి వినియోగదారులకు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయుల కోసం చక్కటి కలెక్షన్స్‌ని కొనుగోలు చేయవచ్చు.