Maternity Insurance: ప్రసూతి బీమా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

ద్రవ్యోల్బణం కంటే ఆసుపత్రి ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రసూతి బీమా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన వధూవరులకు కూడా ఈ బీమా సదుపాయం పొందడం సకాలంలో ఉంది. ఈ బీమా కోసం వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ. డెలివరీ తర్వాత ఈ బీమా అందుబాటులో లేదు. బీమా నిబంధనలలో గర్భం అనేది వ్యాధి కాదు. కనుక ముందుగా ఉన్న పరిస్థితిగా పరిగణించబడుతుంది..

Maternity Insurance: ప్రసూతి బీమా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
Maternity Insurance
Follow us
Subhash Goud

|

Updated on: Aug 29, 2023 | 7:54 PM

ఈరోజు గర్భధారణ అనేది అంత తేలికైన విషయం కాదు. ముఖ్యంగా ప్రసవం ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడికి లోనవుతుంది. సిజేరియన్ డెలివరీకి నీళ్లలా ఖర్చు అవుతుంది. సాధారణ ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ ప్రసవానికి రూ.లక్ష పైనే ఖర్చవుతుంది. కెరీర్ తొలిదశలో ఉన్నప్పుడు ఇంత భారీ మొత్తాన్ని సకాలంలో సెటిల్ చేయడం కష్టం. ద్రవ్యోల్బణం కంటే ఆసుపత్రి ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రసూతి బీమా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన వధూవరులకు కూడా ఈ బీమా సదుపాయం పొందడం సకాలంలో ఉంది. ఈ బీమా కోసం వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ. డెలివరీ తర్వాత ఈ బీమా అందుబాటులో లేదు. బీమా నిబంధనలలో గర్భం అనేది వ్యాధి కాదు. కనుక ముందుగా ఉన్న పరిస్థితిగా పరిగణించబడుతుంది.

ప్రసూతి బీమా ప్రధానంగా అదనపు కవర్‌గా లేదా ఆరోగ్య బీమా పాలసీ పైన అదనపు కవర్ (రైడర్)గా అందుబాటులో ఉంటుంది. అయితే, కొన్ని కంపెనీలు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా తమ ఆరోగ్య బీమా పాలసీల కింద ఈ కవరేజీని అందిస్తాయి. ఉదాహరణకు.. బజాజ్ అలయన్జ్ తన ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ గార్డ్ ప్లాన్ కింద 25 ఏళ్లలోపు ఆరోగ్యవంతమైన జంటకు రూ.9,080కి రూ. 5 లక్షల ఆరోగ్య రక్షణను అందిస్తోంది. ఈ బీమా ప్లాన్‌లో ప్రసూతి కవర్ సౌకర్యం కూడా ఉంటుంది. కంపెనీ హెల్త్ కేర్ సుప్రీం ప్లాన్‌లో కూడా ఇలాంటి కవరేజీ ఉంటుంది.

కొన్ని కంపెనీలు తమ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక పథకంగా ప్రసూతి బీమాను అందిస్తున్నాయి. అయితే, గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కింద మెటర్నిటీ కవర్ అదనపు కవర్‌గా అందించబడుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో వెయిటింగ్ పీరియడ్ ఉండదు. సాధారణ, సిజేరియన్ ప్రసవాలు రెండూ ప్రసూతి బీమా పథకం కింద కవర్ చేయబడతాయి.

ఇవి కూడా చదవండి

బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్రూప్ హెడ్, హెల్త్ మేనేజ్‌మెంట్ భాస్కర్ నెరుర్కర్ ప్రకారం.. “పిల్లలు ఉండాలనుకునే వారికి మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒక ఉపయోగకరమైన ఎంపిక. కానీ, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దీనికి 24 నుంచి 36 నెలల సుదీర్ఘ నిరీక్షణ కాలం ఉండే అవకాశం ఉంది. ప్రసూతి బీమా పథకాన్ని సకాలంలో కొనుగోలు చేయాలి. చాలా సందర్భాలలో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ లేదా వ్యక్తిగత ప్లాన్ కింద మెటర్నిటీ ఇన్సూరెన్స్ అదనపు ఎంపికగా అందుబాటులో ఉంటుంది. అలాంటి ప్లాన్‌లను వ్యక్తులు వారి వివాహం తర్వాత లేదా బిడ్డను కనాలని నిర్ణయించుకునే ముందు కొనుగోలు చేయవచ్చు.

మీరు సకాలంలో ప్రసూతి బీమాను కొనుగోలు చేస్తే ఇది డెలివరీకి 30 రోజుల ముందు, డెలివరీ తర్వాత 90 రోజుల వరకు మీ ఖర్చులను కవర్ చేస్తుంది. పుట్టిన బిడ్డకు ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య ఉంటే, ఆసుపత్రిలో ఉండే ఖర్చు కూడా ఈ పథకం కింద కవర్ చేయబడుతుంది. ఈ పథకం పిల్లలకి వేసిన టీకాల ఛార్జీలను కూడా కవర్ చేస్తుంది. సాధారణంగా బీమా కంపెనీలు గరిష్టంగా 2 పిల్లలకు బీమా రక్షణను అందిస్తాయి. ప్రసూతి బీమా పథకాల విషయానికి వస్తే వేర్వేరు కంపెనీలు వేర్వేరు నియమాలను కలిగి ఉంటాయి.

ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే మీరు మంచి ఆరోగ్య బీమా పథకాన్ని ఎలా కొనుగోలు చేయాలి? “మీరు కంపెనీ నుంచి మీ ఖర్చులను తిరిగి పొందినప్పుడు మీరు ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియంల నిజమైన విలువ మీకు తెలుస్తుంది. అందుకే బీమా ప్లాన్ ప్రీమియంలను చూసే బదులు, కంపెనీ క్లెయిమ్‌ల పరిష్కార గణాంకాలను చూడండి. బీమా నియంత్రణ సంస్థ అయిన IRDA వెబ్‌సైట్‌లో ఈ గణాంకాలు మీకు అందుబాటులో ఉంటాయి. మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఉన్న కంపెనీల బీమా ప్లాన్‌లు మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

ఇంకో విషయం ఏంటంటే కవరేజీ మీ సమీపంలో ఉన్న ఆస్పత్రిలో ఉందో లేదో ఓ సారి చెక్‌ చేసుకోండి. అయితే మీరు కంపెనీ నెట్‌వర్క్ పరిధిలోకి రాని ఆసుపత్రులలో చికిత్స పొందినప్పుడు, మీరు మొదట మీ స్వంత జేబు నుంచి అన్ని ఖర్చులను భరించాలి. తరువాత క్లైయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి