AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas: గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. సిలిండర్ ధరపై భారీ తగ్గింపు

వినియగదారులకు ఏకంగా 400 రూపాయల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఉజ్వల పథకం కింద గ్యాస్‌ సిలిండర్‌ పొందే వారికి మరో 200 రూపాయలు తగ్గింపు ఇచ్చింది. అంటే ఇక నుంచి వీరికి కేవలం 700 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ లభించనుంది. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది..

LPG Gas: గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. సిలిండర్ ధరపై భారీ తగ్గింపు
LPG Gas
Subhash Goud
|

Updated on: Aug 29, 2023 | 4:37 PM

Share

కేంద్ర ప్రభుత్వం దేశంలోని గ్యాస్‌ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త అందించింది. రాఖీ పండగ సందర్భంగా భారీ గిఫ్ట్‌ను అందిస్తూ ప్రకటన చేసింది. ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌పై 200 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు 900లకే గ్యాస్‌ సిలిండర్‌ లభించనుంది. అంతేకాకుండా అదే ఉజ్వల వినియగదారులకు ఏకంగా 400 రూపాయల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఉజ్వల పథకం కింద గ్యాస్‌ సిలిండర్‌ పొందే వారికి మరో 200 రూపాయలు తగ్గింపు ఇచ్చింది. అంటే ఇక నుంచి వీరికి కేవలం 700 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ లభించనుంది. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

రక్షా బంధన్, ఓనం సందర్భంగా దేశంలోని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద కానుకను అందించిందని చెప్పాలి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై రూ.200 సబ్సిడీని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, ఉజ్వల యోజన ద్వారా 10.35 కోట్ల మంది లబ్ధిదారులు రెట్టింపు లాభం పొందుతారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. దీంతో ఖజానాపై రూ.7500 కోట్ల భారం పడనుంది.

ఈ ఏడాది మార్చిలో కూడా ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ సిలిండర్లపై రూ.200 సబ్సిడీని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అటువంటి పరిస్థితిలో ఈ అదనపు సబ్సిడీని పొందడం వల్ల, ఉజ్వల యోజనలో దాదాపు 10.35 కోట్ల మంది లబ్ధిదారులు దాదాపు సగం ధరకే వంటగ్యాస్ సిలిండర్లను పొందుతారు. అదే సమయంలో ఉజ్వల పథకం కింద 75 లక్షల ఉచిత కనెక్షన్లు ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కూడా వచ్చే ఎన్నికలతో ముడిపడి ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ తో పాటు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్రం వరాలు కురిపించింది. ఈ ధరల తగ్గింపుతో దేశంలోని 33 కోట్ల మంది లబ్ది పొందనున్నారు. 2024 ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం ఈ ధర తగ్గింపు తర్వాత ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర సాధారణ వినియోగదారులకు రూ.903, ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ.703గా ఉంటుంది. సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. కాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పేద ప్రజలకు కేవలం రూ.500కే సిలిండర్లను అందజేస్తోంది.

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు