UDGAM: యూడీజీఏఎం పోర్టల్‌లో క్లైయిమ్‌ చేయని డిపాజిట్లను చెక్ చేయడం ఎలా?

సాధారణంగా ఒక కస్టమర్ లేదా థర్డ్ పార్టీ రెండు సంవత్సరాల పాటు సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌ నుంచి ఎలాంటి లావాదేవీలు చేయనప్పుడు, ఆ అకౌంట్‌ పనిచేయదు. అంటే మీరు ఆ ఖాతా నుంచి డబ్బుకోసం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేరు. అదే విధంగా మెచ్యూరిటీ అయిన 2 సంవత్సరాలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ క్లెయిమ్ చేయకపోతే ..

UDGAM: యూడీజీఏఎం పోర్టల్‌లో క్లైయిమ్‌ చేయని డిపాజిట్లను చెక్ చేయడం ఎలా?
Udgam
Follow us

|

Updated on: Aug 29, 2023 | 6:32 PM

మన దేశంలోని ఏదైనా బ్యాంకులో గతంలో ఎప్పుడో డబ్బులు డిపాజిట్ చేసి ఉండవచ్చు. ఆ తరువాత దాని విషయం మర్చిపోయి ఉండవచ్చు. తరువాత అది గుర్తుకువచ్చినా.. ఎక్కడో చేసిన డిపాజిట్.. ఇప్పుడు అక్కడికి వెళ్లి తిరిగి అది వెనక్కి తెచ్చుకోవడం ఎలానో తెలియదు. అలా అయితే ఇదిగో మీకో గుడ్ న్యూస్ ఉంది. సంవత్సరాలుగా ఎక్కడో బ్యాంకులో చిక్కుకుపోయిన మీ డబ్బును క్లైయిమ్‌ చేసుకోండి.

సాధారణంగా ఒక కస్టమర్ లేదా థర్డ్ పార్టీ రెండు సంవత్సరాల పాటు సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌ నుంచి ఎలాంటి లావాదేవీలు చేయనప్పుడు, ఆ అకౌంట్‌ పనిచేయదు. అంటే మీరు ఆ ఖాతా నుంచి డబ్బుకోసం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేరు. అదే విధంగా మెచ్యూరిటీ అయిన 2 సంవత్సరాలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ క్లెయిమ్ చేయకపోతే అది కూడా పనికిరాకుండా పోతుంది. ఈ అకౌంట్‌ 10 సంవత్సరాల పాటు పనిచేయకుండా ఉండిపోయిన తర్వాత బ్యాలెన్స్ రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEAF)కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది.

రిజర్వ్ బ్యాంక్ ఇటీవల UDGAM (అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు – గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్) అనే పోర్టల్‌ను ప్రారంభించింది. మీరు బ్యాంక్ అకౌంట్‌లో ఉంచిన.. క్లెయిమ్ చేయని మొత్తాల గురించిన సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చు. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో క్లెయిమ్‌దారులు లేకుండా 35 వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ డబ్బు రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEAF)లో ఉంది. ఈ ఫండ్‌కు సంవత్సరానికి 3 శాతం చొప్పున సాధారణ వడ్డీ కూడా యాడ్ అవుతూ వస్తోంది.

ఇవి కూడా చదవండి

దేశంలోని 7 బ్యాంకులలో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లతో రిజర్వ్ బ్యాంక్ ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రారంభంలో ఈ పోర్టల్ ద్వారా కొన్ని బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్‌ల గురించిన సమాచారాన్ని పొందవచ్చు. అవి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, డీబీఎస్‌ బ్యాంక్, హమాచి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ బ్యాంక్ – సౌత్ ఇండియన్ బ్యాంక్. అక్టోబర్ 15 నుంచి అన్ని ఇతర బ్యాంకులు కూడా ఈ పోర్టల్‌లో చేరుతాయి.

ఈ పోర్టల్‌ను ఉపయోగించడం ఎలా..?

జీఎల్‌సీ వెల్త్ సీఈవో- సహ వ్యవస్థాపకుడు సంచిత్ గార్గ్ చెబుతున్న దాని ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ UDGAM పోర్టల్‌లో ఎవరైనా వినియోగదారు నమోదు చేసుకోవచ్చు. వారు క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించిన సమాచారాన్ని పొందవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో వినియోగదారు మొబైల్ నంబర్ వినియోగదారు ఐడీగా ఉపయోగిస్తారు. పాస్‌వర్డ్ కూడా ఏర్పాటు చేస్తారు. యూజర్ ఐడి – పాస్‌వర్డ్ ఉపయోగించిన తర్వాత వినియోగదారు పాన్ లేదా పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ నంబర్ లేదా ఓటర్ ఐడి నంబర్‌లో ఏదైనా సమాచారాన్ని అందించాలి.

అదేవిధంగా మీరు మీ ఇంటిలో ఉన్న వ్యక్తి అటువంటి అకౌంట్‌ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు దానిని కూడా చేయవచ్చు. ఆ వ్యక్తి ఫోన్ నంబర్‌ను నమోదు చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ స్వంత నంబర్‌తో పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత, మీరు ఆ వ్యక్తి పేరును నమోదు చేయాలి అంటే ఖాతాదారు లేదా జాయింట్ అకౌంట్ హోల్డర్. అప్పుడు మీరు డ్రాప్-డౌన్ మెను నుంచి సంబంధిత బ్యాంక్‌ను ఎంచుకోవలసి ఉంటుంది, మీకు బ్యాంక్ గురించి సమాచారం లేకపోతే మీరు అన్ని బ్యాంకులను ఎంచుకోవచ్చు. చివరగా, మీరు మీ పాన్ లేదా మీ ఓటరు ID, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పాస్‌పోర్ట్ నంబర్, పుట్టిన తేదీ లేదా వీటిలో దేనినైనా సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత, మీరు చెక్ పై క్లిక్ చేయాలి.

సెర్చ్ రిజల్ట్ కస్టమర్‌కు బ్యాంక్ ఖాతా ఉన్న అన్ని బ్యాంకులను జాబితా చేస్తుంది. ఇప్పుడు మీరు బ్యాంక్ పేరుపై క్లిక్ చేసినప్పుడు, మీరు ‘క్లెయిమ్ చేయని డిపాజిట్స్’ విభాగాన్ని యాక్సెస్ చేయగల దాని అధికారిక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కస్టమర్‌లు క్లెయిమ్ చేయని అకౌంట్‌స్ లిస్ట్ చూడవచ్చు. అదేవిధంగా ఫండ్ క్లెయిమ్ ప్రాసెస్ గురించి మరింత సమాచారం కోసం వెతకవచ్చు. మీరు మిస్ అయిన మీ బ్యాంక్ అకౌంట్‌స్ గురించి పూర్తి సమాచారాన్ని ఈ విధంగా పొందవచ్చు. ఈ UDGAM పోర్టల్‌ని ఉపయోగించడం చాలా సులభం.

సంచిత్ గార్గ్ మాట్లాడుతూ, “మనకు UDGAM పోర్టల్ రూపంలో ఒక ప్లాట్‌ఫారమ్ ఉంది. ఇది ఉపయోగించడానికి సులభమైనది. ఇది ఖాతాదారులకు సాధారణ ప్రజలకు సంవత్సరాల తరబడి నిష్క్రియంగా ఉన్న వారి కోల్పోయిన ఖాతాలను త్వరగా కనుగొనడంలో సహాయపడుతుంది. ఇవి రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్మ్‌ అయిన అకౌంట్స్‌.

అయితే, బ్యాంకింగ్ రంగ నిపుణులు మాత్రం దీన్ని మరింత మెరుగ్గా మార్చవలసి ఉంటుందని అంటున్నారు. ఉదాహరణకు బ్యాంకులు క్లెయిమ్ చేయని అకౌంట్స్‌ లిస్ట్ తో పాటు ఆ అకౌంట్స్‌లో ఉన్న మొత్తం కూడా అక్కడ కనుక్కోగలిగితే మంచిది. ఇదే జరిగితే ప్రజల సమయం ఆదా అవుతుంది. వారు క్లెయిమ్ చేయడానికి ముందుకు వెళ్ళాలా? వద్దా అనే దానిని అక్కడ నిర్ణయించుకోగలుగుతారు.

దీంతోపాటు డేటా భద్రతపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఫోన్ నంబర్‌లతో పాటు ఆధార్ ధృవీకరణ వంటి అంశాలు ఉండాలి. ఇది అనధికారిక లాగిన్ – తప్పుడు క్లెయిమ్‌లను ఫైల్ చేయడాన్ని నిరోధించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

UDGAM పోర్టల్ వ్యక్తుల క్లెయిమ్ చేయని డిపాజిట్‌ల గురించి కనుగొనడంలో సహాయపడవచ్చు. కానీ, క్లెయిమ్‌ను దాఖలు చేసే ప్రక్రియను సరళీకృతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. తమ పేరు మీద అకౌంట్‌ ఉన్నవారు సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఎవరైనా చనిపోతే చనిపోయిన వ్యక్తీ ఎవరినీ నామినీగా పెట్టుకోకపోతే.. ఆ క్లెయిమ్ చేయని అకౌంట్‌ గురించి తెలుసుకున్నప్పటికీ.. క్లెయిమ్ చేసే ప్రక్రియ అంత సులభం కాదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!