Residential Property: భారత్‌లో పెరగనున్న ప్రాపర్టీ ధరలు.. నైట్ ఫ్రాంక్ షాకింగ్ నివేదిక
భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదల, నగర మౌలిక సదుపాయాలలో మెరుగుదల కారణంగా పెట్టుబడిదారులు లగ్జరీ కేటగిరీ గృహాలలో మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నారని కూడా నివేదికలో చెప్పబడింది. ఇది ప్రీమియం ప్రాపర్టీకి డిమాండ్‌ను పెంచుతుంది. దాని ప్రభావం ధరలపై కనిపిస్తుంది. ఈ జాబితాలో బెంగళూరు..

గత కొన్నేళ్లుగా దేశంలో స్థిరాస్తుల ధరలు భారీగా పెరిగాయి. ఈ ట్రెండ్ 2024లో కూడా కొనసాగే అవకాశం ఉంది. ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ2 2023’ నివేదికలో నైట్ ఫ్రాంక్ ముంబైలో లగ్జరీ కేటగిరీ ప్రాపర్టీ ధరలో గరిష్టంగా 5 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదల, నగర మౌలిక సదుపాయాలలో మెరుగుదల కారణంగా పెట్టుబడిదారులు లగ్జరీ కేటగిరీ గృహాలలో మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నారని కూడా నివేదికలో చెప్పబడింది. ఇది ప్రీమియం ప్రాపర్టీకి డిమాండ్‌ను పెంచుతుంది. దాని ప్రభావం ధరలపై కనిపిస్తుంది. ఈ జాబితాలో బెంగళూరు కూడా చేరింది.
ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికం ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీ కేటగిరీ గృహాల ధరల పెరుగుదల జాబితాలో ముంబై పేరు ఆరవ స్థానంలో ఉంది. ఇక మరోవైపు రెండో త్రైమాసికంలో చూసినట్లయితే ప్రాపర్టీ రేట్లలో 5.2 శాతం పెంపు ఉన్నట్లు నివేదిక తెలిపింది. అదే సమయంలో ఐటీ సిటీ బెంగళూరు పేరు కూడా ఈ గ్లోబల్ లిస్ట్‌లో చేరింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే లగ్జరీ ఆస్తుల రేట్లు పెరిగిన లిస్ట్‌లో బెంగళూరు పేరు 20వ స్థానంలో ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ 26వ స్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీరేట్లను విపరీతంగా పెంచగా, ద్రవ్యోల్బణంపై మెరుగ్గా పని చేయడం ద్వారా భారత్ తన విధానంలో స్థిరత్వాన్ని కొనసాగించడంలో విజయం సాధించింది.




జాబితాలో ఈ నగరం అగ్రస్థానంలో..
రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ప్రాపర్టీ దుబాయ్‌లో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఇక్కడ 48.8 శాతం విపరీతమైన వృద్ధి నమోదైంది. ఇలా వచ్చే ఏడాదిలో ఈ లగ్జరీ ప్రాపర్టీ ధరలు విపరీతంగా పెరగనున్నాయని నివేదికలు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




