JIO Tag GO: జియో ట్యాగ్‌ గో రిలీజ్‌ చేసిన జియో.. గూగుల్‌ సాయంతో దుమ్ము రేపుతుందిగా..!

రిలయన్స్ జియో టెక్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జియో ట్యాగ్ గోను ఎట్టకేలకు లాంచ్ చేసింది. జియో ట్యాగ్ గో గూగుల్ ఫైండ్ మై డివైజ్ నెట్‌వర్క్‌తో పనిచేసే కాయిన్-సైజ్ బ్లూటూత్ ట్రాకర్ . ఈ విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకున్న భారతదేశంలో మొట్టమొదటి ట్రాకర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో జియో ట్యాగ్ గో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

JIO Tag GO: జియో ట్యాగ్‌ గో రిలీజ్‌ చేసిన జియో.. గూగుల్‌ సాయంతో దుమ్ము రేపుతుందిగా..!
Jio Tag Go
Follow us
Srinu

|

Updated on: Dec 19, 2024 | 4:47 PM

జియో ట్యాగ్ గో గూగుల్ ఫైండ్ మై డివైజ్‌ యాప్‌ని ఉపయోగించి వినియోగదారులు తమ వస్తువులను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయడానికి అనుమతి ఉంటుంది. జియో ట్యాగ్ గో  అమెజాన్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. జియో ట్యాగ్ గో ధర రూ. 1,499గా నిర్ణయిచగా, నలుపు, తెలుపు, ఆరెంజ్, పసుపు రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటుంది. జియో వెబ్‌సైట్ ప్రకారం ఈ డివైజ్ సమీపంలోని ఆండ్రాయిడ్ డివైజ్‌లను ఉపయోగిస్తుంది. జియో ట్యాగ్ గో ట్రాకర్ బ్లూటూత్ పరిధిలో లేనప్పుడు కూడా లొకేషన్ అప్‌డేట్‌లను అందిస్తుంది. వినియోగదారులు తమ విలువైన వస్తువులను ఎక్కడున్నా వర్చువల్‌గా గుర్తించవచ్చు.

జియో ట్యాగ్ గో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న గూగుల్ ఫైండ్ మై డివైజ్ యాప్ ద్వారా ఏదైనా ఆండ్రాయిడ్ డివైజ్‌లతో పెయిర్ చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. గూగుల్ ఫైండ్ మై డివైజ్ నెట్‌వర్క్‌లోని మిలియన్ల కొద్దీ ఆండ్రాయిడ్ వినియోగదారులు జియో ట్యాగ్ గో వాడవచ్చు. అలాగే ఒకసారి పెయిర్ చేసిన తర్వాత మీ ముఖ్యమైన వస్తువులకు జియో ట్యాగ్ గోను అటాచ్ చేస్తే చాలాు మీరు వాటిని ఎక్కడ ఉన్నా సులభంగా ట్రాక్ చేయవచ్చు. జియో ట్యాగ్ గోను కీలు, వాలెట్లు, పర్సులు, సామగ్రి, గాడ్జెట్లు, బైక్‌లు, మరిన్నింటికి జోడించవచ్చు. 

జియోగ ట్యాగ్ గో సెటప్ ఇలా

  • మీ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ ఫైండ్ మై డివైజ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. 
  • మీ ఫోన్‌కు సమీపంలో ఉన్న జియో ట్యాగ్ గోను ఆన్ చేయాలి. అనంతర ఫాస్ట్ పెయిర్ అని పాప్అప్ చూపిన తర్వాత ‘కనెక్ట్’ నొక్కాలి.
  • యూసేజ్ నిబంధనలను చదివిన తర్వాత “అంగీకరించి కొనసాగించు” ఎంపికను ఎంచుకోవాలి.
  • సెటప్‌ను పూర్తి చేయడానికి ‘పూర్తయింది’ బటన్‌ను నొక్కితే సింపుల్‌గా సెట్ అయిపోతుంది.

మాన్యువల్ సెటప్ ఇలా

  • మీ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫైండ్ మై డివైజ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
  • అలనంతరం సెట్టింగ్‌లు’కి వెళ్లి, ఆపై ‘గూగుల్’ ఎంచుకోవాలి.
  • అక్కడ ఆల్ సర్వీసెస్‌ను ఎంచుకుని ‘కనెక్టెడ్ డివైజ్‌స్ ఎంచుకుని పెయిరింగ్ విభాగానికి వెళ్లి ‘పరికరాలు’ ఎంచుకోవాలి.
  • సమీప డివైజ్‌ల కోసం స్కాన్ చేయి అనే ఆప్షన్‌ను ఎంచుకుని, సమీపంలో అందుబాటులో ఉన్న పరికరాలు’లో జియో ట్యాగ్‌గో కనిపించిన తర్వాత దాన్ని ఎంచుకోవాలి. 
  • జియో ట్యాగ్ గోతో డివైజ్‌కి దగ్గరగా వెళ్లి డివైజ్ పెయిర్ అయ్యే వరకు వేచి ఉండాలి. పెయిర్ అయ్యాక ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించి సెటప్‌ను పూర్తి చేయాలి. 

ఐఓఎస్‌ల కోసం జియో ట్యాగ్ ఎయిర్

జియో ఇప్పటికే ఐఓఎస్ డివైజ్‌ల కోసం జియో ట్యాగ్ ఎయిర్‌ను ప్రారంభించింది. ఇది యాపిల్ ఫైండ్ మై నెట్‌వర్క్ ఆధారంగా పని చేస్తుంది. దీని ధర రూ. 1,499. అలాగే ఈ డివైజ్ గ్రే, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..