సౌదీ అరేబియాకు మరో జాక్‌పాట్.. అక్కడి సముద్రం నిండా తెల్లబంగారం నిల్వలు..!
సౌదీ ఆర్థిక వ్యవస్థకు అత్యంత బలమైన ఆదాయ వనరు చమురు నిక్షేపాలే. సౌదీ వ్యాప్తంగా చమురు బావులు, సహజ వాయువు నిల్వలు విస్తారంగా ఉండగా, సముద్రానికి సమీపంలో ఉన్న చమురు క్షేత్రాలలో తాజాగా తెల్ల బంగారం నిల్వలు గుర్తించారు. నివేదికల ప్రకారం.. సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం, సహజ వాయువు కంపెనీ సౌదీ..
సౌదీ అరేబియాకు ఇప్పుడు మరో జాక్‌పాట్‌ను తగిలింది. ఇప్పటికే చమురు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న సౌదీలో ఇప్పుడు తెల్ల బంగారం నిల్వలు బయటపడ్డాయి. సౌదీ ఆర్థిక వ్యవస్థకు అత్యంత బలమైన ఆదాయ వనరు చమురు నిక్షేపాలే. సౌదీ వ్యాప్తంగా చమురు బావులు, సహజ వాయువు నిల్వలు విస్తారంగా ఉండగా, సముద్రానికి సమీపంలో ఉన్న చమురు క్షేత్రాలలో లిథియం నిల్వలు గుర్తించారు. నివేదికల ప్రకారం.. సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం, సహజ వాయువు కంపెనీ సౌదీ అరామ్‌కో అకా అరమ్‌కో, దాని చమురు క్షేత్రాలలో ఒకదాని నుండి పైలట్ ప్రాజెక్ట్ కింద లిథియంను వెలికితీసింది. సౌదీ అరేబియా మైనింగ్ వ్యవహారాల డిప్యూటీ మంత్రి ఖలీద్ బిన్ సలేహ్ అల్-ముదైఫర్, లిథియం ప్రత్యక్ష మైనింగ్‌ను ప్రోత్సహించడానికి సౌదీ ప్రభుత్వం త్వరలోనే వాణిజ్య పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
కింగ్ అబ్దుల్లా యూనివర్శిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ప్రారంభించబడిన లిథియం ఇన్ఫినిటీని లిహైటెక్ అని కూడా పిలుస్తారు. సౌదీ మైనింగ్ కంపెనీ మాడెన్, అరామ్‌కో సహకారంతో వెలికితీత ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తుందని ఖలీద్ అల్-ముదైఫర్ ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. కింగ్ అబ్దుల్లా యూనివర్శిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో తాము అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీ ద్వారా లిథియంను వెలికితీస్తున్నామని చెప్పారు. ఇందుకోసం వారి వద్ద అన్ని రకాలైన టెక్నాలజీ అందుబాటులో ఉందని మంత్రి చెప్పారు. చమురు క్షేత్రాల వద్ద వాణిజ్య పైలట్‌ను నిర్మిస్తున్నారు. కాబట్టి ఫీల్డ్ నుండి బయటకు వచ్చే ఉప్పునీరు నిరంతర ప్రాతిపదికన ఈ వాణిజ్య పైలట్‌కి శక్తినిస్తుందని చెప్పారు.
చమురు క్షేత్రాల నుండి ఉప్పునీటి ప్రవాహాల ద్వారా లిథియం వేరు చేసి బయట తీయడానికి అయ్యే ఖర్చు ఉప్పు ఫ్లాట్ల నుండి సంగ్రహించే సాంప్రదాయ పద్ధతి కంటే ఎక్కువగా ఉందన్నారు. లిథియం ధరలు పెరిగితే ప్రాజెక్ట్ త్వరలో వాణిజ్యపరంగా మంచి లాభదాయకంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇప్పటకే ఎక్సాన్ మొబిల్, ఆక్సిడెంటల్ పెట్రోలియం (OXY.N)తో సహా ఇతర చమురు కంపెనీలు కూడా ఉప్పునీరు నుండి లిథియంను ఫిల్టర్ చేయడానికి ముందుకు వస్తున్నాయని చెప్పారు.
ఇంతకీ ఈ లిథియమ్ అంటే ఎంటనే సందేహం ఉందా..? ఇది బంగారం కన్నా ఎక్కువే. చేతిలోని స్మార్ట్‌ఫోన్, కొత్తగా కొనుక్కున్న ఎలక్ట్రిక్ కారు, ఇంటి పైకప్పుమీది సోలార్ పవర్ యూనిట్… ఆఖరికి పంటలకు వాడే ఎరువుల వరకూ లిథియం అవసరం లేని రంగం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిలాజ ఇంధన నిల్వలు తగ్గిపోతున్నందున లిథియంను ‘తెల్ల బంగారం’ అని కూడా పిలుస్తారు.. ఇది చమురు, ఇతర సాంప్రదాయ శిలాజ ఇంధనాలను ప్రపంచవ్యాప్తంగా శక్తికి ప్రధమ వనరుగా మారుస్తుంది. ప్రస్తుతం, Lithium-ion (Li-ion) బ్యాటరీలు ఎలక్ట్రిక్ కార్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల నుండి ఎమర్జెన్సీ లైట్లు, బొమ్మలు, రోజువారీ జీవితంలో ఉపయోగించే అందమైన ప్రతి గాడ్జెట్ వరకు దాదాపు ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ను పవర్ అప్ చేయడానికి లిథియమ్ ఉపయోగిస్తున్నారు.