AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best electric bikes: ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా..? తక్కువ ధరలో బెస్ట్ మోటారు సైకిల్స్ ఇవే

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ మోడళ్లు విడుదల అవుతున్నాయి. సాధారణంగా ఈ విభాగంలో స్కూటర్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇవి మహిళలతో పాటు అందరూ డ్రైవింగ్ చేయడానికి సులభంగా సౌకర్యంగా ఉంటాయి.

Best electric bikes: ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా..? తక్కువ ధరలో బెస్ట్ మోటారు సైకిల్స్ ఇవే
Nikhil
|

Updated on: Dec 18, 2024 | 8:00 PM

Share

మంచి పికప్, స్లైలిష్ లుక్ తో బైక్ లను మార్కెట్‌లో విడుదలు చేస్తున్నారు. అవి కూడా కేవలం రూ.1.60 లక్షల ధరలోపు అందుబాటులో ఉన్నాయి. బైక్ లను ఇష్టపడేవారు, వాటిని కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లు, వాటి ప్రత్యేకతలు, ధర (ఎక్స్ షోరూమ్) వివరాలను తెలుసుకుందాం.

ఒబెన్ రోర్

ఒబెన్ రోర్ మోటారు సైకిల్ రూ.1.50 లక్షల ధరలో లభిస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 187 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ బండి గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. ఎకో, స్పీడ్, హావోక్ అనే మూడు రకాల డ్రైవ్ మోడ్ లు అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీని కేవలం రెండు గంటల్లోనే దాదాపు 80 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు. దీనిలో 8 కేడబ్ల్యూ పీఎంఎస్ఎం మోటారు ఏర్పాటు చేశారు.

ఒకాయ ఫెర్రాటో డిస్ట్రప్టర్

ఒకాయ ఫెర్రాటో డిస్ట్రప్టర్ బైక్ రూ.1.60 లక్షలకు అందుబాటులో ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 95 కిలోమీటర్లు. ఫుల్ చార్జింగ్ తో సుమారు 129 కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. ఈ బైక్ 6.37 కేడబ్ల్యూ పవర్, 45 ఎన్ఎం టార్క్ ను విడుదల చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 3.97 కేడబ్ల్యూహెచ్ వద్ద రేట్ చేయబడింది. కనెక్టివీటి ఫీచర్లు, లైవ్ ట్రాకింగ్, సౌండ్ బాక్స్ తదితర ప్రత్యేకతలతో స్పోర్ట్స్ లుక్ లో ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

టోర్క్ క్రాటోస్ ఆర్

ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి టోర్క్ క్రాటోస్ ఆర్ మోటారు సైకిల్ బాగుంటుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 180 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. గంటకు 105 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. దీనిలోని 9కేడబ్ల్యూ పీఎంఏసీ మోటారు నుంచి 38 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. 4కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ అమర్చారు. ఈ బైక్ ధర రూ.1.50 లక్షలు.

రివోల్ట్ ఆర్వీ 400

రివోల్ట్ ఆర్వీ 400 మోటారు సైకిల్ ధర రూ.1.20 లక్షలు. ఫుల్ చార్జింగ్ తో సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. దీనిలో స్మార్ట్ ఫీచర్లతో పాటు మూడు రైడింగ్ మోడ్ లతో కూడిన మొబైల్ యాప్ ఉంది. టెక్నాలజీపై అవగాహన ఉన్న రైడర్లకు చాలా ఉపయోగంగా ఉంటుంది.

హోప్ ఎలక్ట్రిక్ ఓఎక్స్ ఓ

హోప్ ఎలక్ట్రిక్ ఓఎక్స్ ఓ మోటారు సైకిల్ ను ఒక్కసారి రీచార్జి చేస్తే 140 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటకు గరిష్టంగా 88 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. దీన్ని 80 శాతం చార్జింగ్ చేయడానికి సుమారు 4.15 గంటల సమయం పడుతుంది. వివిధ ఫీచర్లతో కూడిన ఐదు అంగుళాల డిజిటల్ డిస్ ప్లే ఆకట్టుకుంటోంది. ఈ బైక్ రూ.1.34 లక్షల ధరకు అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి