Smartphone Exports: నవంబర్‌లో భారత్ నుంచి ఎన్ని కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు అయ్యాయో తెలుసా?
Smartphone Exports: మన దేశంలో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు భారీగా పెరిగాయి. ఈ నవంబర్‌లో ఎగుమతుల సంఖ్య జోరుగా ఉంది. వేల కోట్ల రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్లు ఎగుతమలు అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్ తర్వాత శాంసంగ్ అత్యధిక స్మార్ట్‌ఫోన్ ఎగుమతులను కలిగి ఉంది. ఆపిల్ తర్వాత నవంబర్‌లో..
భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నవంబర్ నెలలో ఎగుమతులు 92% పెరిగాయి. బిజినెస్ స్టాండర్డ్ వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. నవంబర్‌లో రూ. 20,000 కోట్ల విలువైన మొబైల్ ఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. గతేడాది నవంబర్‌లో ఇదే నెలలో రూ.10,634 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. దానితో పోలిస్తే ఈసారి ఎగుమతి దాదాపు రెట్టింపు అయింది. ఈ సంఖ్య పరిశ్రమ సంఘాలు, కంపెనీ స్టేట్‌మెంట్‌లు మొదలైన వాటి నుండి సేకరించిన సమాచారంపై ఆధారపడి ఉంటుంది.
యాపిల్ ఐఫోన్ల ఎగుమతి ఎక్కువ:
నవంబర్‌లో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు బలంగా పెరగడంలో Apple పాత్ర చాలా పెద్దది. నవంబర్ లో రూ.14,000 కోట్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి అయిన సంగతి తెలిసిందే. భారతదేశం నుండి ఇప్పటివరకు ఏ నెలలోనూ ఇదే అత్యధిక ఎగుమతి. అంతకు ముందు నెల (అక్టోబర్)లో రూ.12,000 కోట్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి కావడం రికార్డుగా నిలిచింది. నవంబర్‌లో ఆ రికార్డు బద్దలైంది. Apple తరపున భారతదేశంలో Foxconn, Pegatron, Tata Electronics ద్వారా iPhoneలు అసెంబుల్ జరిగాయి. ముఖ్యంగా ఫాక్స్ కాన్ తమిళనాడు యూనిట్ అత్యధిక ఉత్పత్తిని కలిగి ఉంది.
ఐఫోన్ తర్వాత శాంసంగ్ అత్యధిక స్మార్ట్‌ఫోన్ ఎగుమతులను కలిగి ఉంది. ఆపిల్ తర్వాత నవంబర్‌లో అత్యధిక స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లను శాంసంగ్ ఖాతాలో వేసుకుంది. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ తయారీ, ఎగుమతి పెరగడానికి PLI పథకం బాధ్యత వహిస్తుంది. ఉత్పత్తి పరిమాణం ఆధారంగా ప్రభుత్వం నిధులు సమకూర్చే ఈ PLI పథకం స్మార్ట్‌ఫోన్ రంగానికి ఒక వరం. యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీలు ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి. అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా స్మార్ట్‌ఫోన్ యాక్సెసరీస్ తయారీ కంపెనీలు కూడా భారత్‌లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో భారత తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి