Credit card scam: సొమ్ములు మీవైతే షాపింగ్ వేరే వారిది.. నోయిడాలో వెలుగులోకి క్రెడిట్ కార్డు స్కామ్..!

ఆన్ లైన్ మోసాలు రోజుకో కొత్త విధానంలో జరుగుతున్నాయి. నూతన పద్ధతుల్లో స్కామర్లు నేరాలకు పాల్పడుతున్నారు. ముందుగా అధికారుల పేరుతో బాధితులకు పరిచయం అవుతున్నారు. నెమ్మదిగా మాటలలో పెట్టి, వ్యక్తిగత, బ్యాంకు, ఇతర సమాచారం తెలుసుకుంటున్నారు. నకిలీ యాప్ లతో వారిని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. నోయిడా పోలీసులు ఇటీవల ఇలాంటి ఓ ముఠాను అరెస్టు చేశారు. క్రెడిట్ కార్డు పేరుతో సుమారు 50 మందిని వీరు మోసం చేశారు.

Credit card scam: సొమ్ములు మీవైతే షాపింగ్  వేరే వారిది.. నోయిడాలో వెలుగులోకి క్రెడిట్ కార్డు స్కామ్..!
Follow us
Srinu

|

Updated on: Dec 18, 2024 | 7:45 PM

నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏడీసీపీ) మనీష్ మిశ్రా ఈ ఘటనకు వివరాలు వెల్లడించారు. ఆరుగురు స్కామర్లు ఈ ముఠాగా ఏర్పడ్డారు. క్రెడిట్ కార్డు పరిమితులను పెంచుతామంటూ సుమారు 50 మందికి ఫోన్ చేసి మాటమాటలు చెప్పి నమ్మించారు. ముందుగా వీరందరూ తాము బ్యాంకు అధికారులమని పరిచయం చేసుకున్నారు. గతంలో తామ సేకరించిన బాధితులను వివరాలను వెల్లడించారు. దీంతో వీరందరూ నిజమైన బ్యాంకు అధికారులేనని బాధితులు నమ్మారు. క్రెడిట్ కార్లు లిమిట్ పెంచడం కోసం ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని స్కామర్లు సూచించారు. వీరు చెప్పినట్టుగానే బాధితులందరూ ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. క్రెడిట్ కార్డు పరిమితి పెంచాలంటే దానిలోని వివరాలు పూర్తి చేయాలన్నారు.

మోసగాళ్ల మాటలు నిజమేనని నమ్మిన బాధితులు తమ క్రెడిట్ కార్డు వివరాలు, ఇమెయిల్, పాన్, ఆధార్ కార్డు నంబర్లు, ప్రస్తుత క్రెడిట్ పరిమితులు, సీవీవీ నంబర్ ఇలా.. దానిలో అడిగిన వివరాలన్నీ పూర్తి చేశారు. దీంతో బాధితుల క్రెడిట్ కార్డులు, వాటి పిన్ నంబర్లు, ఇతర వివరాలన్నీ స్కామర్ల చేతిలోకి వెళ్లిపోయాయి. వీటిని ఉపయోగించి ఇ-కామర్స్ సైట్లలో వారికి కావాల్సిన మొబైల్ ఫోన్లు, బంగారు నాణేలు, ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన మెసేజ్ లు బాధితుల ఫోన్లకు రావడంతో వారందరూ గగ్గోలు పెట్టారు. క్రెడిట్ కార్డు పరిమితి పెంచుతామంటూ తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ముమ్మరంగా దర్యాప్తు చేసి స్కామర్ల ముఠాను పట్టుకున్నారు. ఆ ముఠాలోని అమిత్ కుమార్ (28), రవికాంత (45), తేజ్ సింగ్ (24), వికాష్ ఝూ (27), నాగేంద్ర శర్మ (24), నవాబ్ ఖాన్ (24)ను అరెస్టు చేశారు. మోసం, పోర్జరీ, నకిలీ పత్రాలు కలిగి ఉండడం తదితర నేరాలపై కేసులు నమోదు చేశారు. కాగా. ఈ ముఠాకు సూత్రధారి, నకిలీ వెబ్ సైట్ రూపొందించిన మోటా బాయ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆన్ లైన్ మోసాల విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే తీవ్రంగా నష్టపోతారు. నోయిడాలో జరిగిన ఘటన ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. బ్యాంకు, పోలీసు, కేంద్ర ప్రభుత్వ అధికారుల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే జాగ్రత్తగా ఉండాలి. మన వ్యక్తిగత, బ్యాంకు, క్రెడిట్ కార్డుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50 మందికి పైగా ఇలా మోసం పోవడంపై పోలీసులు అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. బాధితులను స్కామర్లు ఎంతలా నమ్మిస్తున్నారనే దానికి ఈ ఘటన ఉదాహరణగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..