AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat global developers: డబ్బే డబ్బు..వద్దంటే డబ్బు.. ఆ షేర్ హోల్డర్స్‌కు అదిరే రాబడి

ప్రస్తుతం అధిక ఆదాయాన్నిచ్చే పెట్టుబడి మార్గాలలో స్టాక్ మార్కెట్ ప్రథమస్థానంలో నిలుస్తోంది. దీనిపై కొంచెం అవగాహన పెంచుకుని డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. స్టాక్ మార్కెట్ నుంచి దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఆర్జించే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం స్టాక్ లు ఉండడం వల్ల వాటి ధరలు పెరిగి లాభాలు వస్తాయి.

Bharat global developers:  డబ్బే డబ్బు..వద్దంటే డబ్బు.. ఆ షేర్ హోల్డర్స్‌కు అదిరే రాబడి
Money Astrology
Nikhil
|

Updated on: Dec 18, 2024 | 7:30 PM

Share

స్టాక్ మార్కెట్ కంపెనీలు కూడా బోనస్, స్టాక్ స్ప్లిట్ రూపంలో ప్రయోజనాలు అందిస్తాయి. ప్రముఖ కంపెనీ అయిన భారత్ గ్లోబల్ డెవలపర్స్ ఇటీవల తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వారికి బోనస్, స్టాక్ స్ప్లిట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. భారత్ గ్లోబల్ డెవలపర్ కంపెనీ వివిధ ఆస్తుల కొనుగోలు, అమ్మకం, పున:విక్రయాలు చేస్తుంది. మౌలిక సదుపాయాలతో పాటు భవనాలు, రోడ్లు, కాంప్లెక్స్ ల నిర్మాణంలో కొనసాగుతోంది. అలాగే వ్యవసాయం, వస్త్రాలు, వినియోగ వస్తువుల పరిశ్రమలకు రా మెటీరియల్ ను ఎగుమతి, దిగుమతులు చేస్తుంది. మల్టీ బ్యాగర్ స్టాక్ అయిన భారత్ డెవలపర్స్ తన వాటాదారులకు 1:10 స్టాక్ స్ప్లిట్, అలాగే 8:10 బోనస్ ఇష్యూ ప్రకటించింది. ఈ కంపెనీ మొదటి సారిగా వీటిని అందజేస్తుంది. ఈ కంపెనీ షేర్లు స్టార్ మార్కెట్ లో లాభాల బాటలో పయనిస్తున్నాయి. గత రెండేళ్లలో 8006 శాతం రాబడిని ఇచ్చాయి. గతేడాది లో లెక్క చూస్తే 2619 శాతం ఆదాయాన్ని అందజేస్తాయి. ఇక 2024లో దాదాపు 2133.33 శాతం ఇచ్చాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా ఆగ్రో, మెక్ కెయిన్ ఇండియాతో పాటు దుబాయి ఆధారిత సంస్థలకు సేవలు అందించడం ద్వారా భారత్ డెవలపర్స్ కంపెనీ విజయవంతంగా నడుస్తోంది. అనేక సుమారు రూ.1500 కోట్లకు పైగా ఒప్పందాలతో బలమైన ప్రగతిని సాధించింది. కంపెనీ తన వాటాదారులకు 8:10 నిష్పత్తిలో బోనస్ షేర్ ప్రకటించింది. అంటే ప్రస్తుతం పది షేర్లు ఉన్న ఇన్వెస్టర్లు మరో ఎనిమిది షేర్లకు బోనస్ గా పొందుతారు. ఇవి ఒక్కొక్కటీ రూ.పది ముఖ విలువను కలిగి ఉంటాయి. షేర్ హోల్డర్, రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి ఈ ఆఫర్ ఉంటుంది. అలాగే కంపెనీ బోర్డు 1:10 నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్ చేయనుంది. దీని వల్ల షేర్ ముఖ విలువ రూ.10 నుంచి రూ.ఒకటికి తగ్గుతుంది.

భారత్ గ్లోబల్ డెవలపర్స్ కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశం డిసెంబర్ 12వ తేదీ జరిగింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీటికి రికార్డు తేదీగా డిసెంబర్ 26ను ఖరారు చేశారు. కంపెనీ ప్రకటించిన ఆఫర్ ను స్వీకరించడానికి వాటాదారులు అర్హులో కాదో నిర్ధారించే విధించే గడువునే రికార్డు తేదీ అంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి