దీపావళి సీజన్‌లో బంగారం కొన్నారా..? అయితే.. మీకో షాకింగ్ న్యూస్..!!

దీపావళి రోజు బంగారం కొన్నారా..? అయితే.. బంగారు ప్రియులకు ఇది కాస్త షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మెరిసెదంతా.. బంగారం అనుకొని అపోహ పడుతున్నారా.. అయితే.. మీరు పప్పులో కాలు వేసినట్లే. పండుగ సీజన్స్‌లో బంగారానికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే.. బంగారం అంటే లక్ష్మీ దేవి ప్రతి రూపం అని అందరూ అంటూంటారు. అందులోనూ.. అక్షయ తృతీయకి, ధన్‌తేరాస్ రోజు, దీపావళి రోజున బంగారం కొనడం కొంతమందికి ఆనవాయితీ. దాంతో.. బంగారం షాపు యజమానులు.. పలు […]

దీపావళి సీజన్‌లో బంగారం కొన్నారా..? అయితే.. మీకో షాకింగ్ న్యూస్..!!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 01, 2019 | 5:25 PM

దీపావళి రోజు బంగారం కొన్నారా..? అయితే.. బంగారు ప్రియులకు ఇది కాస్త షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మెరిసెదంతా.. బంగారం అనుకొని అపోహ పడుతున్నారా.. అయితే.. మీరు పప్పులో కాలు వేసినట్లే.

పండుగ సీజన్స్‌లో బంగారానికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే.. బంగారం అంటే లక్ష్మీ దేవి ప్రతి రూపం అని అందరూ అంటూంటారు. అందులోనూ.. అక్షయ తృతీయకి, ధన్‌తేరాస్ రోజు, దీపావళి రోజున బంగారం కొనడం కొంతమందికి ఆనవాయితీ. దాంతో.. బంగారం షాపు యజమానులు.. పలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. ఇదంతా ఎటున్నా.. ఎందులోనైనా మోసాలు అనేవి కామన్. అయితే.. తాజాగా.. దీపావళి రోజు.. వినియోగదారులు కొనుగోలు చేసిన బంగారంలో.. 48 శాతం మోసాలు వెలుగుచూశాయట. అంతేకాకుండా.. వీటిపై నోయిడా కమ్యునిటీ.. సర్వే నిర్వహించిందట. ఇందులో పలు ఇంట్రెస్టింగ్ నిజాలు వెల్లడయ్యాయి.

Gold Prices Hit Record High At Rs 74,588 for 10 grams In Pakistan

చాలామంది బంగారం కొన్నామంటే.. కొన్నామని అపోహ పడుతూంటారు. కానీ.. గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఉన్న ప్రజలకు.. బంగారం ప్రామాణ్యంపై సరైన అవగాహనలు ఉండవు. ఇక పలు నగరాల్లో నివసించే ప్రజలు, అలాగే.. చదవుకున్నవారు అయితే.. బంగారంపై ఉన్న హాల్‌మార్క్, 24 క్యారెట్స్ లేదా 22 క్యారెట్స్‌ లోగో, ఎక్కడైతే కొనుగోలు చేస్తారో.. ఆ జ్యువెలరీ షాపు లోగో అన్నీ గమనిస్తారు. కానీ.. నిజానికి.. చదువులేని వారు.. గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్నవారు ఇవి గమనించరు. ఇక్కడే గోల్డ్ షాపు యజమానులు పలు మోసాలకు పాల్పడుతున్నారట.

అంతే కాకుండా.. మరికొందరు బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు సరైన బిల్లును అడగరు. ఒకవేళ మీరు కొనుగోలు చేసిన బంగారం మంచిది కాకపోతే.. బిల్లు తీసుకోనందున.. మీరు ఆ షాపు యజమానికి అడిగే హక్కును కోల్పోతారు. దీంతో.. ఆ తరువాత లబోదిబోమనాల్సి ఉంటుంది. ఇప్పటికే.. కేంద్ర ప్రభుత్వం.. బంగారం నాణ్యతపై.. పలు ప్రకటనలు ఇస్తున్నారు కూడా. వీటితో కొందమంది మేల్కొన్న.. మరికొందరు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. కాగా.. నోయిడా కమ్యునిటీ తేల్చిన సర్వే ప్రకారం.. 52 శాతం మంది బంగారం నాణ్యత పరిశీలించగా.. 48 శాతం మంది మాత్రం నాణ్యతలేని బంగారాన్ని కొనుగోలు చేసినట్టు తేలింది.

కాగా.. ఈ రోజు 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ10 తక్కువ రూ.40వేలకు చేరుకుంది. అలాగే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.38 వేలుగా పలుకుతోంది.