AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Refund: మీరు సమయానికి ముందే మీ ITR ఫైల్‌ చేసినా.. రీఫండ్‌ రాలేదా..? ఈ కారణాలు ఉండొచ్చు.. చెక్‌ చేసుకోండి!

ITR Refund: మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ని సకాలంలో సమర్పించి, డిపార్ట్‌మెంట్ నుండి మీకు రీఫండ్ అందకపోతే అందుకు కారణాలు తెలుసుకోవడం..

ITR Refund: మీరు సమయానికి ముందే మీ ITR ఫైల్‌ చేసినా.. రీఫండ్‌ రాలేదా..? ఈ కారణాలు ఉండొచ్చు.. చెక్‌ చేసుకోండి!
Itr Refund
Subhash Goud
|

Updated on: Sep 20, 2022 | 9:50 AM

Share

ITR Refund: మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ని సకాలంలో సమర్పించి, డిపార్ట్‌మెంట్ నుండి మీకు రీఫండ్ అందకపోతే అందుకు కారణాలు తెలుసుకోవడం ముఖ్యం. మీకు రీఫండ్‌ రాకపోతే ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి సమయం ఇస్తుంటుంది. అయితే, ఆదాయపు పన్ను చెల్లింపుదారులను రీఫండ్‌లో జాప్యంతో సహా అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలుకు గడువు ముగిసి 49 రోజులు గడిచాయి. మీరు ఇప్పటి వరకు ITR రీఫండ్ అందుకోకపోతే. వాపసు స్థితిని ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్‌లో తనిఖీ చేయవచ్చు. ITR రీఫండ్‌లో జాప్యం అనేది వివిధ కారణాల వల్ల జరగవచ్చు.

బ్యాంక్ ఖాతాను తనిఖీ చేయండి

ITR రీఫండ్ ఆలస్యం కావడానికి ఒక కారణం బ్యాంక్ ఖాతా ధృవీకరణ. పన్ను చెల్లింపుదారులు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ చేయడం ద్వారా బ్యాంక్ ఖాతా ధృవీకరణను తనిఖీ చేయవచ్చు. ఇందులో మీ బ్యాంక్ ఖాతా మీ పాన్‌కి సంబంధించినదా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గత బకాయిలను చూడండి

గత ఆర్థిక సంవత్సరం నుండి పన్ను చెల్లింపుదారుల బకాయిలు పెండింగ్‌లో ఉంటే, ఈ పరిస్థితిలో కూడా వాపసు చేయడంలో చాలా ఆలస్యం కావచ్చు. అటువంటి పరిస్థితిలో ఆదాయపు పన్ను శాఖ ఆ డిమాండ్‌కు అనుగుణంగా రీఫండ్ మొత్తాన్ని సర్దుబాటు చేస్తుందని టాక్స్ కన్సల్టెంట్ చెబుతున్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు దీనిని తనిఖీ చేయాలి.

రూ. 100 కంటే తక్కువ రీఫండ్‌లో జాప్యం

ఐటిఆర్ రీఫండ్ ఆలస్యం కావడానికి కారణం ఉండవచ్చు. రీఫండ్ మొత్తం రూ.100 కంటే తక్కువ ఉంటే, ఆదాయపు పన్ను శాఖ మీ బ్యాంకు ఖాతాలో జమ చేయదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

పెండింగ్ ప్రక్రియ ఆలస్యం

డిపార్ట్‌మెంట్ ద్వారా ITR ప్రాసెస్ చేసినప్పుడు మాత్రమే ఆదాయపు పన్ను వాపసు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ముందుగా తమ ఆదాయపు పన్ను రీఫండ్ డిపార్ట్‌మెంట్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే అర్హులైన పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ రీఫండ్ జారీ చేసింది. సెప్టెంబర్ 8, 2022 వరకు రూ. 1.19 లక్షల కోట్ల ఐటీఆర్ రీఫండ్‌లను జారీ చేశామని, ఇది గత ఏడాది ఇదే కాలంలో జారీ చేసిన రీఫండ్‌ల కంటే 65.29 శాతం ఎక్కువ అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.