AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: PM-వాణి పథకం కింద ప్రభుత్వం Wi-Fi ప్యానెల్‌, రూ.15,000 అద్దెను ఇస్తోంది.. ఇందులో నిజమెంత..?

Fact Check: మారుతున్న కాలంలో, స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ఈ రోజుల్లో అవసరంగా మారాయి. పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో, ఈ రోజుల్లో పుకార్లు, నకిలీ వార్తలు కూడా సోషల్ మీడియాలో..

Fact Check: PM-వాణి పథకం కింద ప్రభుత్వం Wi-Fi ప్యానెల్‌, రూ.15,000 అద్దెను ఇస్తోంది.. ఇందులో నిజమెంత..?
Fact Check
Subhash Goud
|

Updated on: Sep 19, 2022 | 7:26 AM

Share

Fact Check: మారుతున్న కాలంలో, స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ఈ రోజుల్లో అవసరంగా మారాయి. పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో, ఈ రోజుల్లో పుకార్లు, నకిలీ వార్తలు కూడా సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఏదైనా సోషల్ మీడియా వచ్చే వార్తలను నమ్మే ముందు, PIB ఫాక్ట్ చెక్ చేయాలని నిర్ధారించుకోండి. ఇది సైబర్ నేరాల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కొంత కాలంగా, ప్రభుత్వం ప్రజలకు Wi-Fi ప్యానెల్‌లు, రూ. 15,000 అద్దె, PM-వాణి పథకం వంటి ఉద్యోగాలను వాగ్దానం చేసిందని సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎవరైనా మీకు కూడా ఈ సందేశాన్ని పంపినట్లయితే జాగ్రత్తగా ఉండాలి.

వైరల్‌ అవుతున్న సందేశాల సారాంశం ఏమిటి?

పీఎం వాణి యోజన కింద ప్రజల నుంచి కేవలం రూ.650 మాత్రమే తీసుకుని తమ ఇంట్లో వై-ఫై ప్యానల్‌ను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం కల్పిస్తోందని ఓ వార్త వైరల్‌ అవుతోంది. దీంతో పాటు ఉద్యోగాలు, అద్దె రూ.15వేలు అందుతాయి. Wi-Fi ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి, మీకు 15 X 25 అడుగుల స్థలం ఉండాలని కూడా చెబుతుంటారు. ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేసేందుకు కోర్టుతో 20 ఏళ్ల ఒప్పందం ఉంటుంది. దీనితో పాటు, ఈ ఒప్పందం పూర్తయితే, మీకు రూ. 20 లక్షల నగదు లభిస్తుందిని వైరల్‌ అవుతున్న పందేశం సారాంశం.

పీఐబీ నిజం చెప్పింది

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వైరల్ అవుతున్న సందేశాన్ని తనిఖీ చేసింది. ఈ వాస్తవ తనిఖీలో (PIB ఫాక్ట్ చెక్), ఈ క్లెయిమ్ పూర్తిగా నకిలీదని తేలింది. ఈ విషయంపై పీఐబీ అది ఫేక్ లెటర్ అని ట్వీట్‌లో పేర్కొంది. PM-వాణి పథకం కింద రూ. 650 రుసుము బదులుగా Wi-Fi ప్యానెల్లు, 15,000 అద్దె, ఉద్యోగాలు అందిస్తామన్నది పూర్తిగా అబద్దమని తెలిపింది. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని సూచిస్తోంది. టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ఏ వ్యక్తి నుండి ఎలాంటి డబ్బు డిమాండ్ చేయదు. సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని ఫ్యాక్ట్‌ చెక్‌ ద్వారా తెలిపింది.

దీనితో పాటుగా, ప్రభుత్వం మాత్రమే ప్రధానమంత్రి వాణి యోజన కింద దేశంలోని మారుమూల ప్రాంతాల్లో Wi-Fi, బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏ వ్యక్తి నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. వైరల్‌ అవుతున్న సందేశాలు పూర్తిగా నకిలీవని గుర్తించాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి