Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR: ఐదు లక్షల రూపాయల లోపు ఆస్తులు ఉన్నా ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలి?

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏ వ్యక్తికైనా పన్ను విధించదగిన ఆదాయం రూ. 5 లక్షలకు మించకపోతే, అతను పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌ను పూరించవచ్చు. సెక్షన్ 87A కింద రూ.12,500 వరకు రాయితీ లభిస్తుంది. సెక్షన్ 87A కింద అటువంటి మినహాయింపును క్లెయిమ్ చేయడానికి పన్ను చెల్లింపుదారు తన ఐటీఆర్‌ని ఫైల్ చేయడం తప్పనిసరి..

ITR: ఐదు లక్షల రూపాయల లోపు ఆస్తులు ఉన్నా ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలి?
ITR Filing
Follow us
Subhash Goud

|

Updated on: Jul 29, 2023 | 8:21 PM

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొంత లావాదేవీలు జరిపిన వారందరూ పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. మరోవైపు, స్థూల మొత్తం ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరానికి (AY 2023-24) ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువగా ఉంటే ఐటీఆర్‌ని ఫైల్ చేయడం తప్పనిసరి. మరోవైపు, ఒక వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షలకు మించకపోతే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87A ప్రకారం మినహాయింపు అనుమతించబడుతుంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏ వ్యక్తికైనా పన్ను విధించదగిన ఆదాయం రూ. 5 లక్షలకు మించకపోతే, అతను పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌ను పూరించవచ్చు. సెక్షన్ 87A కింద రూ.12,500 వరకు రాయితీ లభిస్తుంది. సెక్షన్ 87A కింద అటువంటి మినహాయింపును క్లెయిమ్ చేయడానికి పన్ను చెల్లింపుదారు తన ఐటీఆర్‌ని ఫైల్ చేయడం తప్పనిసరి.

మీరు ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనట్లయితే, దానిని జూలై 31లోపు ఫైల్ చేయండి. లేకుంటే జరిమానాతో కూడిన రిటర్న్‌ను దాఖలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తారు. ఐటీఆర్‌ ఫైల్ చేయడం ఎందుకు తప్పనిసరి అని వివరించడానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. ఒక వ్యక్తి నికర పన్ను విధించదగిన ఆదాయం రూ. 4.25 లక్షలు. అయితే ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటుంది. అయితే, రూ.4.25 లక్షల ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల కంటే ఎక్కువగా ఉంది. అందుకే ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయడం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది

మీ ఐటీఆర్‌ ఫైలింగ్ తప్పనిసరి అయితే, మీరు ఇప్పటికీ ఐటీఆర్‌ ఫైలింగ్ గడువును కోల్పోయి ఉంటే, మీరు ఇప్పటికీ మీ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. గడువు ముగిసిన తర్వాత దాఖలు చేసిన రిటర్న్‌ను వ్లేటెడ్ ఐటీఆర్ అంటారు. అయితే మీరు ఆలస్యంగా ఐటీఆర్‌ ఫైల్ చేస్తే, మీరు పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. ఇతర ప్రయోజనాలను కోల్పోతారు.

జరిమానా మొత్తం

ప్రస్తుత గడువు జూలై 31, 2023. ఐటీఆర్ ఫైల్ చేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే జరిమానా మొత్తం రూ. 1,000కు మించదు. రూ. 5 లక్షల కంటే తక్కువ పన్ను విధించదగిన ఆదాయం కోసం సెక్షన్ 87A కింద పన్ను మినహాయింపు కారణంగా ఎలాంటి పన్ను బాధ్యత ఉండదు. అయితే రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయ స్థాయికి మీరు పన్ను బాధ్యతను కలిగి ఉండి, ఐటీఆర్ ఫైల్ చేయకుంటే సెక్షన్ 234A కింద జరిమానా వడ్డీ విధించబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి