ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే అలెర్ట్.. ఆ విషయాలు తెలుసుకోకపోతే ఇక అంతే..!
భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటక ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం ప్రతి పౌరుని బాధ్యత. ప్రతి ఆర్థిక సంవత్సరంలో జూలై నెల ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్యమైన, కీలకమైన సమయం. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కాలపరిమితిలోపు మీ ఐటీఆర్ కచ్చితంగా ఫైల్ చేయాలి. 2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఈ గడువులోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే చట్టపరమైన సమస్యలకు దారితీస్తుంది.
భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటక ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం ప్రతి పౌరుని బాధ్యత. ప్రతి ఆర్థిక సంవత్సరంలో జూలై నెల ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్యమైన, కీలకమైన సమయం. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కాలపరిమితిలోపు మీ ఐటీఆర్ కచ్చితంగా ఫైల్ చేయాలి. 2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఈ గడువులోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే చట్టపరమైన సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా మీ ఆర్థిక ప్రణాళిక పై ప్రభావం చూపుతుంది. కాబట్టి గడువులోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఏయే సమస్యలు వస్తాయో? ఓ సారి తెలుసుకుందాం.
ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు వివిధ రకాల పన్ను చెల్లింపుదారులకు మారుతూ ఉంటుంది. కొన్ని వర్గాలు గడువు పొడగింపు ఉంటుంది. కాబట్టి మీకు ఏది వర్తిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. గడువు తేదీ తర్వాత మీరు మీ ఐటీఆర్‌ను ఫైల్ చేస్తే, మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఏ కింద ఆర్థిక జరిమానాలు, వడ్డీ ఛార్జీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ జరిమానాలు అనేవి మీరు ఎంత ఆలస్యంగా ఫైల్ చేశారు? మీ పన్ను బాధ్యత పై మొత్తం ఆధారపడి ఉంటుంది. అదనంగా సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం మీ స్థూల మొత్తం ఆదాయం ఆధారంగా రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు ఆలస్య రుసుమును విధిస్తారు.
మీ ఐటీఆర్‌ను ఆలస్యంగా ఫైల్ చేయడం వలన కొన్ని రకాల నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు గడువు తర్వాత ఫైల్ చేస్తే ఇంటి ఆస్తికి సంబంధించినవి మినహా వ్యాపారం, మూలధన నష్టాలను ముందుకు తీసుకెళ్లడం లేదా భవిష్యత్తు ఆదాయానికి వ్యతిరేకంగా ఆఫ్సెట్ చేయడం సాధ్యం కాదు. ఆలస్యంగా దాఖలు చేసేవారు పన్ను అధికారుల నుంచి అధిక పరిశీలనను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఆడిట్లు, తదుపరి విచారణలకు దారితీయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..