DOLO Fruad: డోలో ట్యాబ్లెట్ల విక్రయంలో భారీ ఫ్రాడ్.. సీబీడీటీ దాడుల్లో వెలుగులోకి షాకింగ్ విషయాలు..

DOLO Fruad: డోలో ట్యాబ్లెట్లు అమ్ముకోవడంలో అవకతవకలు జరిగాయా? మైక్రోల్యాబ్స్‌ సంస్థ అనైతిక మార్గాల్లో తమ ఔషధాన్ని అమ్ముకుందా?

DOLO Fruad: డోలో ట్యాబ్లెట్ల విక్రయంలో భారీ ఫ్రాడ్.. సీబీడీటీ దాడుల్లో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Dolo
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 15, 2022 | 9:24 AM

DOLO Fruad: డోలో ట్యాబ్లెట్లు అమ్ముకోవడంలో అవకతవకలు జరిగాయా? మైక్రోల్యాబ్స్‌ సంస్థ అనైతిక మార్గాల్లో తమ ఔషధాన్ని అమ్ముకుందా? CBDT దాడుల్లో వెలుగుచూస్తున్న విషయాలు.. షాక్‌కు గురిచేస్తున్నాయి. జ్వరం వచ్చిందా? డోలో వేస్కో. కాస్త తలనొప్పిగా ఉందా? డోలో దాలో. ఒకప్పుడు పారాసిటమాల్‌ టాబ్లెట్‌. ఇప్పుడు దాని డోసు పెంచి డోలో 650గా తీసుకొచ్చి ప్రజల జ్వరాలపై కోట్లాది రూపాయలు సంపాదించినట్లు తేలింది. డోలో 650 మాతృసంస్థ మైక్రో ల్యాబ్స్‌పై జరిగిన ఐటీ దాడుల్లో షాకింగ్‌ విషయాలు బయటికొస్తున్నాయి. కోవిడ్‌ సమయంలో అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయిన డోలో.. ఐటీ రిటర్న్స్‌ దాఖలు విషయంలో అవకతవకలు జరిగాయని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ గుర్తించింది. దీంతో దేశవ్యాప్తంగా మైక్రోల్యాబ్స్‌ సంస్థ ఆఫీసులపై దాడులు చేసి జరిగిన అవకతవకలను బయటకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన గిఫ్టులని డాక్టర్లకు, మెడికల్‌ ప్రొఫెషనల్స్‌కి పంచినట్లు తేలింది. ఇది చట్టవిరుద్ధమే కాదు.. అనైతికం కూడా. తమ ప్రాడక్ట్‌ని అమ్ముకోడానికి డాక్టర్లకి లంచాలు ఇచ్చి ప్రిస్క్రైబ్‌ చేయించడం దారుణమైన చర్య అంటోంది CBDT.

గత వారం మైక్రోల్యాబ్స్‌ సంస్థకి సంబంధించి 36 కేంద్రాల్లో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోడమే కాకుండా.. కోటిన్నర రూపాయల క్యాష్‌, గోల్డు, ఆభరణాలు కూడా దొరికినట్లు తెలుస్తోంది. ఇక డోలో 650ని ప్రిస్క్రైబ్‌ చేయడానికి డాక్టర్లకు విలువైన వస్తువులను గిఫ్టుల కింద ఇచ్చినట్లు తేలింది. అనేక పేర్లతో ఈ గిఫ్టుల పంపిణీ కూడా జరిగినట్లు విచారణలో బయటపడింది. ప్రమోషన్‌ అండ్‌ ప్రాపగాండ, సెమినార్స్‌ అండ్‌ సింపోసియమ్స్‌, మెడికల్‌ అడ్వైజరీస్‌ అంటూ.. విలువైన గిఫ్టులను డాక్టర్లకు ఇచ్చింది మైక్రోలాబ్స్‌. ఇందులో విలువైన ఫోన్లు కూడా ఉన్నట్లు తేలింది. మైక్రోల్యాబ్స్‌ యాభై దేశాల్లో తమ ఔషధాలను విక్రయిస్తోంది. వీటిలో డోలో 650 సేల్సే ఎక్కువ. ఈ ఒక్క డ్రగ్‌తో ఈ సంస్థ వేలాది కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. డోలో 650 అనేది జ్వరానికే కాదు.. ఒళ్లు నొప్పులు, తలనొప్పికి కూడా ఇదే రాస్తున్నారు డాక్టర్లు. ఇలా డోలోని చీటీలో రాసివ్వడానికి డాక్టర్లకు విలువైన గిఫ్టులు ఇచ్చిపడేస్తున్నారు. మెడికల్‌ రెప్రజెంటేటివ్స్‌ ఈ బాధ్యత తీసుకుంటున్నారు. తమ టార్గెట్‌ పూర్తిచేస్తే.. మెడికల్‌ రెప్‌లకు కూడా గిఫ్టులు, విదేశీ ట్రిప్పులు ఉంటాయని విచారణలో తేలింది. మైక్రోలాబ్స్‌ దీనికే వెయ్యికోట్లు ఖర్చుచేసిందంటే.. దాని వెనుక ఎన్ని వేల కోట్లు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..