Rupee Down: ఆల్ టైమ్ రికార్డ్.. దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. డాలర్‌తో పోలిస్తే..

Rupee Falls: పతనం కొనసాగుతోంది. రూపాయి విలువ దిగజారుతోంది. డాలర్‌తో పోల్చితే.. రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతుండడం..

Rupee Down: ఆల్ టైమ్ రికార్డ్.. దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. డాలర్‌తో పోలిస్తే..
Rupee
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 15, 2022 | 9:25 AM

Rupee Falls: పతనం కొనసాగుతోంది. రూపాయి విలువ దిగజారుతోంది. డాలర్‌తో పోల్చితే.. రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతుండడం తెగ టెన్షన్‌ పెడుతోంది. అవును, డాలర్‌తో పోల్చితే.. రూపాయి మరింత బక్కచిక్కింది. మరో 22 పైసలు క్షీణించిన రూపాయి 79.88 దగ్గర స్థిరపడింది. రూపాయి మారకం 80కి చేరువ కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల 79.23 దగ్గర స్థిరపడిన రూపాయి.. గురువారం మరింత పడిపోయింది. ఆర్బీఐ ఎన్ని చర్యలు చేపడుతున్నా రూపాయి పతనానికి బ్రేకులు పడడం లేదు. ఇటీవల రెపో రేటును వరుసగా రెండుసార్లు పెంచినా ఫలితం లేకుండా పోయింది. అంతర్జాతీయ ప్రతికూలతలు రూపాయి మారకంపై తీవ్ర ప్రతికూలతను చూపుతున్నాయి.

అంతర్జాతీయంగా డాలర్‌ బలపడటం సైతం రూపాయి పతనానికి దారితీస్తోంది. కొన్ని రోజులుగా రూపాయి వాల్యూ పడిపోతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతోన్న క్రూడాయిల్ ధరలు రూపాయి నష్టాలను కాస్త తగ్గిస్తాయని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు.

ఆరు మేజర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ బలపడింది. డాలర్ వాల్యూ 0.56 శాతం లాభపడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ పరంగా చూసుకుంటే.. బీఎస్ఈ సెన్సెక్స్ 86.61 పాయింట్లు తగ్గి 54,395.23 వద్ద క్లోజైంది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫ్లాట్‌గా 4.60 పాయింట్లు మాత్రమే నష్టపోయి 16,216 వద్ద ముగిసింది. డాలర్ వాల్యూ స్థిరంగా పెరుగుతూ ఉండటంతో పాటు, అమెరికా వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో.. ఈ నెలలో ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు 4 వేల కోట్లకు పైగా ఈక్విటీలను వెనక్కి తీసుకున్నారు. అయితే.. కొన్ని వారాలుగా ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకం కాస్త తగ్గింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..