AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: ఈ బడ్జెట్‌లో మంత్రి నిర్మలమ్మ పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా..?

Budget 2025: పాత పన్ను విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, పన్ను, పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ ది మింట్‌తో మాట్లాడుతూ, కొత్త పన్ను విధానానికి ఆధారమైన మీ ఆదాయానికి సంబంధించిన సరైన సమాచారాన్ని అందించాలని ప్రభుత్వం కోరుతున్నదని..

Budget 2025: ఈ బడ్జెట్‌లో మంత్రి నిర్మలమ్మ పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా..?
Subhash Goud
|

Updated on: Jan 26, 2025 | 6:34 PM

Share

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2025న బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ప్రభుత్వం పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తుందా లేదా అనే దానిపై ముందుగా చర్చ జరుగుతోంది. కొత్త పన్ను విధానం 1 ఫిబ్రవరి 2020న సాధారణ బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టారు. పాత పన్ను విధానంలో అనేక రకాల తగ్గింపులు, మినహాయింపులు ఉన్నాయి. అందుకే ప్రజలు దీన్ని ఎక్కువగా ఇష్టపడ్డారు. అయితే కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. కానీ తగ్గింపులు, మినహాయింపుల ప్రయోజనాలు అంతగా లేవు.

ప్రభుత్వం ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలనుకుంటున్నదని ఆర్థిక మంత్రి ఇటీవల చెప్పారు, కొత్త పన్ను విధానంతో పోల్చితే ప్రభుత్వం పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తుందని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అదేవిధంగా, సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై మినహాయింపు నిబంధన ఉంది. అంటే, దీని కింద, పన్ను చెల్లింపుదారులు తమకు, వారి కుటుంబానికి వైద్య బీమా ప్రీమియంపై మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఇది పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

పాత పన్ను విధానానికి తెరపడుతుందా ?

పాత పన్ను విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, పన్ను, పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ ది మింట్‌తో మాట్లాడుతూ, కొత్త పన్ను విధానం పట్ల ప్రభుత్వ పక్షపాత వైఖరి, పెరుగుతున్న ప్రజల సంఖ్య, కొత్త పన్ను విధానం అమలు తర్వాత ప్రభుత్వం పక్షపాత వైఖరిని పరిగణనలోకి తీసుకుంటుంది. పాత పద్ధతిలో తగ్గింపు, మినహాయింపు పరిమితిని కూడా పెంచలేదు. ఆర్థిక మంత్రి పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.

కొత్త పన్ను విధానానికి ఆధారమైన మీ ఆదాయానికి సంబంధించిన సరైన సమాచారాన్ని అందించాలని ప్రభుత్వం కోరుతున్నదని, అందుకే త్వరలోనే ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి