AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Scooter: లక్ష రూపాయాల్లో లక్షణమైన స్కూటర్ విడుదల.. ఫీచర్స్ తెలిస్తే ఎగిరిగంతేస్తారంతే..!

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఈ స్కూటర్ల అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. దీంతో చాలా కంపెనీలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే సరికొత్త ఫీచర్స్‌తో ఈవీ స్కూటర్స్‌ను లాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ఆటో ఎక్స్‌పో-2025లో ప్రముఖ కంపెనీ ఫెర్రాటో డీఫై-22 పేరుతో సూపర్ ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

EV Scooter: లక్ష రూపాయాల్లో లక్షణమైన స్కూటర్ విడుదల.. ఫీచర్స్ తెలిస్తే ఎగిరిగంతేస్తారంతే..!
Ferrato Defi 22
Nikhil
|

Updated on: Jan 26, 2025 | 6:30 PM

Share

ఓపీజీ మొబిలిటీ గతంలో ఒకాయ ఈవీగా ఉండే ఈ కంపెనీ ఇటీవల భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025 లో ఫెర్రాటో డిఫై-22 ఎలక్ట్రిక్ స్కూటర్ను ప్రారంభించి ఆ కంపెనీ లైనప్‌ను విస్తరించింది . ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 99,999(ఎక్స్-షోరూమ్). అయితే నామమాత్రపు బుకింగ్ మొత్తం రూ. 499తో జనవరి 17, 2025 నుంచి  ప్రీ- బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్ డిజైన్ గురించి చెప్పాలంటే ఈ స్కూటర్ సైడ్ ప్యానెల్‌పై కంపెనీ బ్యాడ్జింగ్‌తో ఎక్స్‌టెండెడ్ ఫ్రంట్ ఆప్రాన్ ఆకర్షిస్తుంది. అలాగే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, డ్యూయల్-లెవల్ ఫ్లోర్ బోర్డ్, సైడ్ ప్యానెల్ పై లైన్స్, సింగిల్-పీస్ గ్రాబ్ రైల్, ఆకట్టుకునే టెయిల్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్ ప్రత్యేకతగా ఉన్నాయి. 

ఫెర్రాటో డీఫై-22 1.2 కేడబ్ల్యూహెచ్ మోటారుతో వస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 70 గంటకు కిలోమీటర్ వేగంతో దూసుకుపోతుంది. జ్యూస్డ్ బ్యాటరీపై, మోడల్ ఐసీఏటీ- సర్టిఫైడ్ 80 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇక బ్యాటరీ ప్యాక్ విషయానికొస్తే ఈ స్కూటర్ 2.2 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీతో పని చేస్తుంది.  ఫెర్రాటో డీఫై-22 స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. ఎకో, సిటీ, స్పోర్ట్స్ మోడ్స్‌లో ఈ స్కూటర్‌పై దూసుకుపోవచ్చు. ఈ స్కూటర్ 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ప నడుస్తుంది. అలాగే 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ఈ స్కూటర్ ప్రత్యేకత. 

ఈ స్కూటర్‌లో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ వంటి ఫీచర్లను ఆశ్వాదించవచ్చు. సస్పెన్షన్ డ్యూటీల విషయానికొస్తే ఈ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్ల ద్వారా ఈ స్కూటర్ వేగాన్ని నియంత్రించవచ్చు. ఈ స్కూటర్ 25 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీని అందిస్తుంది. డీఫై-22 ఏడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. షాంపైన్ క్రీమ్, బ్లాక్ ఫైర్, కోస్టల్ ఐవరీ, యూనిటీ వైట్, రెసిలెన్స్ బ్లాక్, డోవ్ గ్రే మరియు మ్యాట్ గ్రీన్ వంటి రంగుల్లో కొనుగోలుకు సిద్దంగా ఉంటుంది. అయితే బుకింగ్స్ ప్రారంభమైనా ఈ స్కూటర్ డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో? కంపెనీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..