Income Tax: 90 వేల మంది ఉద్యోగులు.. రూ.1,070 కోట్లు.. భారీగా పన్ను ఎగవేత బట్టబయలు!
Income Tax: పలు కేసుల్లో ఒకే కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులు తప్పుడు ప్రకటనలు చేసినట్లు కూడా ఆ శాఖ విచారణలో వెల్లడైంది. దీంతో కొంత పన్ను ఎగవేత జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్షన్ 80GGB/80GGC కింద చూపిన తగ్గింపులకు, వాస్తవ రశీదులకు మధ్య భారీ వ్యత్యాసం..

పెద్ద సంఖ్యలో తప్పుడు రీఫండ్ క్లెయిమ్‌లను ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. దాదాపు 90,000 మంది జీతభత్యాల పన్ను చెల్లింపుదారుల ద్వారా రూ.1,070 కోట్ల విలువైన పన్ను మినహాయింపు క్లెయిమ్‌లు తప్పుగా వెల్లడయ్యాయి. సెక్షన్‌లు 80C, 80D, 80E, 80G, 80GGB, 80GGC కింద ITRలో తప్పుడు తగ్గింపులను చూపడం ద్వారా ఈ క్లెయిమ్‌లు చేర్చారు. ఈ ఉద్యోగులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెద్ద కంపెనీలు, బహుళజాతి కంపెనీలలో పనిచేస్తున్నారని గుర్తించారు. దీంతో అధికారులు యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి ఉద్యోగులకు అవగాహన కల్పించారు. తదనంతరం పన్ను చెల్లింపుదారులు తప్పు క్లెయిమ్‌లను ఉపసంహరించుకున్నారు. అలాగే అదనపు పన్నును చెల్లించారు.
ఆదాయపు పన్ను శాఖ భారీ పన్ను ఎగవేతను బట్టబయలు చేసింది. దాదాపు 90,000 మంది వేతన ఉద్యోగులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లలో (ITR) పన్ను మినహాయింపును తప్పుగా క్లెయిమ్ చేశారని అధికారులు గుర్తించడంతో ఈ విషయం బట్టబలైంది. ఈ ఉద్యోగులు ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద తప్పుడు మినహాయింపులు చూపినట్లు ఆ శాఖ విచారణలో తేలింది. 80C, 80D, 80E, 80G, 80GGB, 80GGC సెక్షన్ల కింద పెట్టుబడి, బీమా, విరాళం, వైద్య ఖర్చులు మొదలైన వాటిపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
పలు కేసుల్లో ఒకే కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులు తప్పుడు ప్రకటనలు చేసినట్లు కూడా ఆ శాఖ విచారణలో వెల్లడైంది. దీంతో కొంత పన్ను ఎగవేత జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్షన్ 80GGB/80GGC కింద చూపిన తగ్గింపులకు, వాస్తవ రశీదులకు మధ్య భారీ వ్యత్యాసం కనిపించిందని డిపార్ట్‌మెంట్ తెలిపింది. అదేవిధంగా, సెక్షన్లు 80C, 80E, 80G కింద చేసిన క్లెయిమ్‌లు కూడా అనుమానాస్పదంగా కనిపించాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి