Mahila Samman Savings Certificate: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పన్ను రహితమా? నిబంధనలివే
ధికారికంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని ఏప్రిల్ 1, 2023 ప్రారంభించారు. మహిళలు తమ ఆర్థిక లేదా పొదుపు లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడే లక్ష్యంతో రూపొందించబడిన కొత్త, చిన్న-పొదుపు పథకం గురించి మరిన్ని వివరాలు ఓ సారి తెలుసుకుందాం.
మహిళల్లో పొదుపు బాధ్యతను పెంపొందిచడానికి కేంద్రం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఈ పథకం గురించి ప్రకటన చేశారు. అధికారికంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని ఏప్రిల్ 1, 2023 ప్రారంభించారు. మహిళలు తమ ఆర్థిక లేదా పొదుపు లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడే లక్ష్యంతో రూపొందించబడిన కొత్త, చిన్న-పొదుపు పథకం గురించి మరిన్ని వివరాలు ఓ సారి తెలుసుకుందాం.
మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పన్ను రహితమా?
ప్రస్తుతానికి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం పెట్టుబడి రూపంగా ఎలాంటి పన్ను ప్రయోజనాలు లేదా మినహాయింపులకు అర్హత పొందలేదు. కాబట్టి, ఈ పథకం కింద వచ్చే వడ్డీ మీ వర్తించే పన్ను స్లాబ్‌ల ప్రకారం పన్ను విధిస్తారు. వడ్డీ ఆదాయం, మీ పన్ను స్లాబ్‌పై ఆధారపడి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై హోల్డింగ్ బ్యాంక్ ఆటోమేటిక్‌గా టీడీఎస్ కట్ అవుతుంది.
రెండు సంవత్సరాల డిపాజిట్ పథకం
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం మహిళలు, బాలికలకు మాత్రమే. ఈ వన్-టైమ్ స్కీమ్ రెండేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. అంటే ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పథకం గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ సదుపాయాన్ని అందిస్తుంది. అలాగే రెండు సంవత్సరాల పాటు స్థిర వడ్డీ రేటుతో అందుబాటులో ఉంటుంది. ఇది ప్రభుత్వం మద్దతుతో వచ్చే చిన్న-పొదుపు పథకం. అందువల్లచాలా తక్కువ అనుబంధిత క్రెడిట్ రిస్క్ ఉంది. ఈ పథకం కోసం కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000. మహిళలు లేదా మైనర్ బాలికల సంరక్షకులు మాత్రమే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి రెండేళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. మెచ్యూరిటీ మొత్తం రెండు సంవత్సరాల తర్వాత ఖాతాదారునికి చెల్లించబడుతుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత వడ్డీ ఖాతాదారునికి చెల్లిస్తారు. ఖాతా తెరిచిన తేదీ నుండి ఒక సంవత్సరం తర్వాత ఖాతాదారుడు తమ సేవ్ చేసిన నిధుల్లో 40 శాతం వరకూ ఈ స్కీమ్ నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మహిళా-కేంద్రీకృత పథకం సంవత్సరానికి 7.5 శాతం స్థిర వడ్డీ రేటును అందిస్తుంది. ఇది త్రైమాసికానికి క్రెడిట్ అవుతుంది. ఈ సొమ్మును ఖాతా మూసివేత సమయంలో చెల్లిస్తారు. ఈ పథకం కోసం ఈ వడ్డీ రేటు చాలా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర చిన్న పొదుపు పథకాలు అందించే దాని కంటే ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..