AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Dates: ముంచుకొస్తున్న గడువు.. ఇన్‌కమ్‌ట్యాక్స్ చెల్లింపుదారులు మే నెలలో చేయాల్సిన పనులివే..!

ముఖ్యంగా పన్ను ప్రణాళిక లేకపోవడంతో ఇలాంటి ఇబ్బంది వస్తుంది. అయితే పన్ను ప్రణాళిక ప్రధాన లక్ష్యం పన్ను బాధ్యతను తగ్గించడంతో పాటు పన్ను మొత్తాన్ని తగ్గించడం. పన్నుప్రణాళికను పాటించే వారి కోసం ఆదాయపు పన్ను శాఖ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. చాలా పన్ను చెల్లింపుల గడువులు మేలో ముగుస్తాయి.

Income Tax Dates: ముంచుకొస్తున్న గడువు.. ఇన్‌కమ్‌ట్యాక్స్ చెల్లింపుదారులు మే నెలలో చేయాల్సిన పనులివే..!
Income Tax
Nikhil
|

Updated on: May 07, 2023 | 6:45 PM

Share

పన్ను చెల్లింపు అంటే పన్ను చెల్లింపుదారులకు ఓ టాస్క్. ఎలాంటి ఫైన్ లేకుండా పన్ను చెల్లించాలంటే కొన్ని ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవాలి. అయితే ఇలాంటి వారి కోసం ఆదాయపు పన్ను శాఖ ఆన్‌లైన్ ఈ ఫైలింగ్ అందుబాటులోకి తీసుకువచ్చినా పన్ను చెల్లింపు విషయంలో చేసే కొన్ని తప్పుల వల్ల మళ్లీ ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా పన్ను ప్రణాళిక లేకపోవడంతో ఇలాంటి ఇబ్బంది వస్తుంది. అయితే పన్ను ప్రణాళిక ప్రధాన లక్ష్యం పన్ను బాధ్యతను తగ్గించడంతో పాటు పన్ను మొత్తాన్ని తగ్గించడం. పన్నుప్రణాళికను పాటించే వారి కోసం ఆదాయపు పన్ను శాఖ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. చాలా పన్ను చెల్లింపుల గడువులు మేలో ముగుస్తాయి. కాబట్టి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మేలో పన్ను చెల్లింపు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయపు పన్ను శాఖ తన వెబ్‌సైట్‌లో ముఖ్యమైన తేదీల వివరాలను పేర్కొంది. ఆదాయపు పన్ను విషయంలో మేలో వచ్చే ఆ ముఖ్యమైన తేదీలేంటో? ఓ సారి తెలుసుకుందాం.

మే 7

ఏప్రిల్ 2023లో పన్ను మినహాయించిన లేదా సేకరించిన డిపాజిట్‌కు మే7 గడవుగా ఉంది. అయితే ప్రభుత్వ కార్యాలయం ద్వారా తీసేసిన లేదా సేకరించిన మొత్తానికి ఉత్పత్తి లేకుండా పన్ను చెల్లించినా అదే రోజు ప్రభుత్వ ఖజానాకు చెల్లిస్తారు. దీన్నే ఆదాయపు పన్ను చలాన్ అని పేర్కొంటారు

మే 15

మార్చి 2023లో ఆదాయపు పన్ను శాఖ సెక్షన్లు 194-1ఏ, 194-1 బీ, 194 ఎం, 194 ఎస్ కింద మినాహాయించిన టీడీఎస్ సర్టిఫికేట్ జారీ చేయడానికి మే 15 గడువు తేదీగా ఉంది. ఇది ప్రభుత్వ కార్యాలయం ద్వారా ఫారమ్ 24 జీ అందించడానికి కూడా గడువు తేదీగా వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్ 2023లో టీడీఎస్/టీసీఎస్ చలాన్ లేకుండానే చెల్లిస్తారు. అయితే మార్చి 31తో ముగిసే త్రైమాసికానికి మే 15లోగా టీసీఎస్ త్రైమాసిక ప్రకటనను కూడా డిపాజిట్ చేయాలి. అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఫారమ్ నెంబర్ 3బీబీలో స్టేట్‌మెంట్ అందించడానికి కూడా గడువు మే 15తో ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

మే 30

ఏప్రిల్ 2023లో సెక్షన్లు 194-1ఏ, 194-1బి, 194-ఎం, 194-ఎస్ ద్వారా మినహాయించిన పన్నుకు సంబంధించి చలాన్-కమ్-స్టేట్‌మెంట్‌ను అందిచడానికి మే 30తో ముగుస్తుంది. 2022-23 సంవత్సరానికి సంబంధించి భారతదేశంలో అనుసంధాన కార్యాలయం కలిగిన నాన్ రెసిడెంట్ స్టేట్‌మెంట్ సమర్పించడానికి కూడా మే 30 గడవు తేదీగా ఉంది. 

మే 31 

మార్చి 31, 2023తో ముగిసే త్రైమాసికానికి సంబంధించి జమ చేసిన టీడీఎస్ త్రైమాసిక స్టేట్‌మెంట్‌ను మే 31 లోపు సమర్పించాలి. అలాగే ఆమోదించిన సూపర్ యాన్యయేషన్ ఫండ్‌కు ట్రస్టీలు చెల్లించిన చందాల నుంచి పన్ను మినహాయింపు రిటర్న్‌ను ఈ తేదీలోపు సమర్పించాలి. అంతేకాకుండా 2022-23 సంవత్సరానికి సంబంధించి చట్టంలోని సెక్షన్-285 బీఏ సబ్ సెక్షన్ -1 ప్రకారం అందించాల్సిన ఆర్థిక లావాదేవీల స్టేట్‌మెంట్ అందిచడానికి కూడా గడువు మే 31గా ఉంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?