Car headlamps: ఎల్ఈడీ హెడ్ ల్యాంపులతో ఇంత ప్రమాదమా.. కార్లు యజమానులు గమనించాల్సిన అంశాలు ఇవే.!.

దేశంలో కారును వినియోగించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సురక్షిత ప్రయాణం, వ్యక్తిగత అవసరాలు తదితర వాటి కోసం దీన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎలాంటి సమయంలోనైనా ప్రయాణం చేయడానికి వీలుగా కారును సిద్ధంగా ఉంచుకోవాలి. వీటిలో పగటి పూటి ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ రాత్రి సమయంలో జర్నీకి మాత్రం లైట్లు కీలకంగా మారతాయి. వీటి నుంచి కాంతి బాగా వచ్చినప్పుడే ప్రయాణం సాఫీగా జరుగుతుంది.

Car headlamps: ఎల్ఈడీ హెడ్ ల్యాంపులతో ఇంత ప్రమాదమా.. కార్లు యజమానులు గమనించాల్సిన అంశాలు ఇవే.!.
Car Head Lamps
Follow us
Srinu

|

Updated on: Dec 09, 2024 | 5:09 PM

రోడ్డుపై గుంతలు, గోతులు స్పష్టంగా కనిపిస్తేనే వాహనం నడపడం సౌకర్యంగా ఉంటుంది. దీంతో చాాలామంది తమ కార్లలోని హాలోజెన్ హెడ్ ల్యాంపులను తీసివేసి ఎల్ ఈడీ బల్బులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటివల్ల కాంతి ఎక్కువగా వస్తుంది. అయితే హెడ్ ల్యాంపులను ఇలా మార్చుకోవడం మంచి కాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆటో పరిశ్రమలో ఎల్ఈడీ హెడ్ లైట్ల వాడకం సర్వసాధారణంగా మారింది. గతంలో ఇవి ప్రీమియం ఫీచర్ గా ఉండేవి. హై ఎండ్ కార్లలో మాత్రమే కనిపించేవి. అయితే కొన్నేళ్లుగా తక్కువ ధరకు లభించే మాస్ మార్కెట్ కార్లలోకి కూడా అందుబాటులోకి వచ్చాయి. కారులోని ఎల్ఈడీ హెడ్ ల్యాంపుల నుంచి కాంతి బాగా వస్తుంది. ప్రయాణం సమయంలో రోడ్డుపై చాలా దూరం ప్రసరిస్తుంది.

హలోజెన్ హెడ్ ల్యాంపుల నుంచి విడుదలయ్యే కాంతి పసుపు రంగులో ఉంటుంది. కానీ ఎల్ ఈడీల నుంచి తెల్లని కాంతి బయటకు వస్తుంది. కాంతి ఎక్కువగా రావడం వల్ల ప్రయాణానికి చాలా వీలుగా ఉంటుంది. దీంతో చాలా మంది తమ కార్లలోని ఓఈఎం హాలోజన్ హెడ్‌లైట్ బల్బులను మార్చి ఎల్ ఈడీ బల్బులను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటిని ఇన్ స్టాల్ చేసుకోవడం కూడా చాలా సులభం. ఎల్ఈడీ బల్బుల వల్ల కొన్ని సందర్భాల్లో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుంది. వాహనం నడపడం కష్టంగా మారుతుంది. వాతావరణం బాగున్నప్పుడు డ్రైవింగ్ సౌకర్యంగా చేయవచ్చు. కానీ పొగమంచు, వర్ష వాతావరణం ఉన్నప్పుడు వీటి నుంచి వచ్చే కాంతి రోడ్డుపై తక్కువగా పడుతుంది. రహదారి సరిగ్గా కనిపించక ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ఎల్ఈడీ బల్బుల నుంచి వచ్చే కాంతి చాలా దూరం పడడడంతో పాటు ప్రకాశవంతంగా ఉంటుంది. అదే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలపై డ్రైవర్లపై పడుతుంది. దీంతో వారికి తాత్కాలిక అంధత్వం ఏర్పడుతుంది. వాహనాన్ని నియంత్రించడం కష్టంగా మారుతుంది.

హలోజెన్ హెడ్ ల్యాంపుల నుంచి వెలువడే పసుపు రంగు కాంతి పొగమంచు నుంచి దూసుకుపోతుంది. దీంతో వర్షం కురిసినప్పడు, పొగమంచులో ప్రయాణం చేసేటప్పుడు ఆ లెట్లు ఉపయోగంగా ఉంటాయి. దారి స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకనే ఆటోమేకర్లు చాాలా కార్లలో ఫాగ్ ల్యాంపు కోసం పసుపు దీపాలను వినియోగిస్తారు. కాబట్టి కారులో బల్బులను మార్చుకునేటప్పుడు అన్ని లాభనష్టాలను క్షుణ్ణంగా గమనించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి