Backbone one: మార్కెట్ లోకి వచ్చేసిన గేమ్ చేంజర్.. ఇక మొబైల్ గేమ్‌లకు నో బ్రేక్

దేశంలో ఆన్ లైన్ గేమింగ్ ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది. కొందరు పని ఒత్తిడితో చిరాకుగా ఉన్నప్పుడు వివిధ గేమ్ లు ఆడుతూ ఉంటారు. మరి కొందరికి హాబీగా ఉంటుంది. అయితే ఇలాంటి గేమ్ లు ఆడటానికి ప్రత్యేకంగా పరికరాలు అవసరం.

Backbone one: మార్కెట్ లోకి వచ్చేసిన గేమ్ చేంజర్.. ఇక మొబైల్ గేమ్‌లకు నో బ్రేక్
Backbone One
Follow us
Srinu

|

Updated on: Dec 09, 2024 | 4:30 PM

సాధారణంగా అవి ఇంటిలోనే అందుబాటులో ఉంటాయి. దీంతో బయట ఉన్న సమయంలో, ఆఫీసులో భోజన విరామంలో, వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు గేమింగ్ కుదరదు. ఇలా బాధపడేవారికి ఇది శుభవార్త. స్మార్ట్ ఫోన్ ను గేమింగ్ కన్సోల్ గా మార్చుకునే పరికరం అందుబాటులోకి వచ్చింది. దాని ధర, ఇతర వివరాలు తెలుసుకుందాం. దేశంలో గేమింగ్ పరిశ్రమ 2024 ఆర్థిక సంవత్సరంలో 3.8 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో రెండింతలు పెరిగి సుమారు 9.2 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యలో ప్రముఖ గేమింగ్ యాక్సెసరీ బ్రాండ్ అయిన బ్యాక్ బోన్ దేశ మార్కెట్ లోకి వివిధ పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్రాండ్ బ్యాక్ బోన్ వన్ అనే పేరుతో ప్రారంభించింది. ఇది మీ స్మార్ట్ ఫోన్ ను గేమ్ కన్సోల్ గా మార్చుతుంది.

బ్యాక్ బోన్ వన్ రెండు రకాల వేరియంట్లలో లభిస్తుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఆండ్రాయిడ్ పరికరాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే పాత తరం ఐ ఫోన్లకు కూడా వినియోగించుకునే వీలుంది. సోనీ ప్లే స్టేషన్ భాగస్వామ్యంతో డెవలప్ చేసిన ప్లే స్టేషన్ ఎడిషన్ తో పాటు స్డాండర్డ్ బ్లాక్ డిజైన్ తో దొరుకుతుంది. యూఎస్ బీ సీ, లైట్నింగ్ పోర్టులతో కూడిన మోడల్ రూ.7,769 నుంచి అందుబాటులో ఉంది. అలాగే దీనిలోని ప్రీమియం కాన్ఫిగరేషన్ కావాలంటే రూ.12.400 ఖర్చవుతుంది. బ్యాక్ బోన్ వన్ లోని ప్రత్యేకతల విషయనికి వస్తే గేమింగ్ లో మంచి నియంత్రణ కోసం ట్రిగ్గర్లు, థంబ్ స్టిక్ లు, డీ ప్యాడ్ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ సైజుకు అనుగుణంగా మార్చుకునేందుకు మాగ్నెటిక్ ఎడాఫ్టర్ ఉపయోగపడుతుంది. దీంతో చాలా సులువుగా ఈ ఫోన్ కు అమర్చుకునే వీలు కలుగుతుంది. కంట్రోలర్ యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి అనేక రకాల గేమ్ లక మద్దతు ఇస్తుంది. ప్లే స్టేషన్ రిమోట్ ప్లే, ఎక్స్ బాక్స్ లేదా పీసీ గేమ్ లను ఆడుకోవడానికి వీలుంటుంది. వీటితో పాటు కన్సోల్, పీసీ లేకుండానే నేరుగా ఫోన్ లో ఫోర్జా మోరిజెన్ 5, స్టార్ ఫైల్డ్ తదితర గేమ్ లు ఆడుకునేందుకు ఎక్స్ బాక్స్ గేమ్ పాస్ అల్టీమేట్ ను యాక్సెస్ చేయవచ్చు.

ఈ గేమింగ్ పరికరంలో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, అల్ట్రా లెస్ లేటెన్సీ కనెక్షన్, ఇన్ స్టంట్ గేమ్ ప్లే క్యాప్చర్, గేమింగ్ సమయంలోనే చార్జింగ్ చేసుకునే టెక్నాలజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ పరికరాన్నిఎక్కడికైనా చాలా సులుభంగా తీసుకువెళ్లవచ్చు. ఇంటర్నెట్ వినియోగం పెరగడం, గేమింగ్ పరికరాలు అందుబాటులోకి రావడం, వాటి ధరలు కూడా తక్కువ ఉండడంతో గేమింగ్ క్రమంగా విస్తరిస్తోంది. గతంలో నగరాల్లో మాత్రమే కనిపించే ఈ విధానం.. ఇప్పుడు ఓ మాదిరి పెద్ద గ్రామాలకు కూడా విస్తరించింది. స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరగడం దీని వెనుక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కోవిడ్ అనంతరం అనేక గేమింగ్ ప్లాట్ ఫాంలు అందుబాటులోకి వచ్చాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి