AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: ఇల్లు కొనకుండా హోమ్ లోన్ సాధ్యమా..? మార్కెట్ నిపుణులు చెబుతుంది ఏంటంటే..?

ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఖర్చులు, అవసరాల నేపథ్యంలో రుణం తీసుకోవడం అనేది సర్వ సాధారణంగా మారింది. ముఖ్యంగా ఇల్లు, పొలం వంటి స్థిరాస్తులు కొనుగోలు సమయంలో కచ్చితం బ్యాంకుల తలుపులు తట్టడం పరిపాటిగా మారింది. భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సొంత ఇల్లు అనేది ప్రతి ఉద్యోగి చిరకాల కోరిక. అయితే ఈ కోరికను నెరవేర్చుకునేందుకు తాను చేసిన పొదుపుతో పాటు గృహ రుణం తీసుకుంటూ ఉంటారు.

Home Loan: ఇల్లు కొనకుండా హోమ్ లోన్ సాధ్యమా..? మార్కెట్ నిపుణులు చెబుతుంది ఏంటంటే..?
Home Loan
Nikhil
|

Updated on: Aug 01, 2024 | 4:30 PM

Share

ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఖర్చులు, అవసరాల నేపథ్యంలో రుణం తీసుకోవడం అనేది సర్వ సాధారణంగా మారింది. ముఖ్యంగా ఇల్లు, పొలం వంటి స్థిరాస్తులు కొనుగోలు సమయంలో కచ్చితం బ్యాంకుల తలుపులు తట్టడం పరిపాటిగా మారింది. భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సొంత ఇల్లు అనేది ప్రతి ఉద్యోగి చిరకాల కోరిక. అయితే ఈ కోరికను నెరవేర్చుకునేందుకు తాను చేసిన పొదుపుతో పాటు గృహ రుణం తీసుకుంటూ ఉంటారు. అయితే ఇంటిని కొనుగోలు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడే రుణం తీసుకుంటే ఒకేసారి సొమ్ము ఇవ్వడం వల్ల రేటు తగ్గుతుందని భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంటి రుణం అనేది ఇల్లును కొనుగోలు చేసే సమయంలోనే ఇస్తారా..? అనే అనుమానం అందరికీ వస్తుంది. నిపుణులు మాత్రం ముందస్తు గ‌ృహ రుణం అనేది బ్యాంకులు అందిస్తాయని చెబుతున్నారు. కాబట్టి ముందస్తు గృహ రుణం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణంగా ముందుగా ఆమోదించే గృహ రుణాన్ని అందిస్తాయి. ఇలాంటి రుణం ముందుగా మంజూరైతే గృహ కొనుగోలుదారుడు ధైర్యం సొంత ఇంటిని కొంటారని నిపుణులు చెబుతున్నారు. ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్‌తో తనకు ఎంత బడ్జెట్‌లో ఇల్లు కావాలో? ముందుగానే అంచనాకు వస్తారని పేర్కొంటున్నారు.  ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్ తరచుగా వడ్డీ రేట్ల కోసం లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తుందని, అలాగే రుణ ప్రక్రియ కూడా వేగంగా ఉంటుందని వివరిస్తున్నారు.  ముందస్తు గృహ రుణం ప్రత్యేకంగా మూడు నుంచి ఆరు నెలల వరకు చెల్లుబాటు అవుతుందని, అయితే ఈ లోన్ రుణ ఆమోదానికి హామీ ఇవ్వనప్పటికీ రుణ అర్హతకు బలమైన సూచికని వివరిస్తున్నారు. 

ప్రీ అప్రూవ్‌డ్ హోమ్ లోన్‌ను ఇన్-ప్రిన్సిపల్ సాంక్షన్ అని కూడా పిలుస్తారు. ఇది దరఖాస్తుదారుకు సంబధించిన ఆదాయం, క్రెడిట్ యోగ్యత, ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ సాధారణంగా ఆస్తిని ఎంచుకోవడానికి ముందు తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా చాలా బ్యాంకులు ఈ ఆమోదం మూడు నెలల పరిమిత కాలానికి చెల్లుబాటు అవుతుంది. ఈ వ్యవధిలో ఆస్తి ఎంపికను ఖరారు చేయాలి. లేకుంటే దరఖాస్తుదారుడు రుణదాతకు తాజా ఆదాయ పత్రాలను సమర్పించడం ద్వారా రుణ దరఖాస్తును తిరిగి అంచనా వేయాలి. ముందుగా ఆమోదించిన రుణానికి సంబంధించిన నిబంధనలు, వడ్డీ రేటు, సమానమైన నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు), పదవీకాలం వంటివి పంపిణీ సమయానికి మారవచ్చని గమనించడం ముఖ్యం. తుది రుణ నిబంధనలు దాని ఆధారంగా నిర్ణయిస్తారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి