AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Packages: రూ. 10 వేలకే 11 రోజులు ఉత్తర భారత యాత్ర.. ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ వివరాలు

IRCTC Tourism: ప్రయాణికుల సౌకర్యార్థం ఐఆర్‌సీటీసీ ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తోంది. కేవలం 10వేల రూపాయలకే 11 రోజుల పాటు ఉత్తర భారత దేశ యాత్రకు తీసుకెళ్లనుంది...

IRCTC Tour Packages: రూ. 10 వేలకే 11 రోజులు ఉత్తర భారత యాత్ర.. ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ వివరాలు
Irctc Tourism
Subhash Goud
|

Updated on: Mar 26, 2021 | 6:03 PM

Share

IRCTC Tourism: ప్రయాణికుల సౌకర్యార్థం ఐఆర్‌సీటీసీ ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తోంది. కేవలం 10వేల రూపాయలకే 11 రోజుల పాటు ఉత్తర భారత దేశ యాత్రకు తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తెలుగు రాష్ట్రాల పర్యాటకుల కోసం ఉత్తర భారత యాత్ర విత్‌ మాత వైష్ణోదేవి పసేరుతో ఈ టూర్‌ ప్యాకేజీ ప్రయాణికులకు అందిస్తోంది. 11 రోజుల్లో ఆగ్రా, మథుర, వైష్ణోదేవి, అమృత్‌సర్‌, హరిద్వార్‌, ఢిల్లీ లాంటి ప్రాంతాలను కవర్‌ చేస్తుంది. తీర్థయాత్ర ప్రత్యేక పర్యాటక రైలులో ఈప్రాంతాలకు తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ఈ ప్యాకేజీ బుక్‌ చేసుకోవచ్చు. పర్యాటకులు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్‌, పెద్దపల్లి, కాజిపేట, రామగుండంలో టూరిస్ట్‌ రైలు ఎక్కువ సదుపాయం ఉంది. ఏప్రిల్‌ 24, 2021న ఈ ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్రారంభమై మే 4వ తేదీన ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ టూరిజం ‘ఉత్తర భారత యాత్ర విత్ మాతా వైష్ణో దేవి’ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,400. ఇది స్టాండర్డ్ ధర. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.17,330. తీర్థయాత్రలకు వెళ్లాలనుకునేవారి కోసం తక్కువ ధరకే 11 రోజుల టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 11 రోజులు, 10 రాత్రులు ఈ టూర్‌ ప్యాకేజీ అందిస్తోంది. ఉత్తర భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇందులో కవర్‌ అవుతాయి. స్టాండర్డ్‌ ప్యాకేజీలో స్లీపర్‌ క్లాస్‌ జర్నీ, బస ఏర్పాట్లు, టీ, కాఫీ, శాకాహార భోజనం, రోజూ 1 లీటర్‌ డ్రింకింగ్‌ వార్‌, టూర్‌ఎస్కార్ట్స్‌ , సెక్యూరిటీ ఏర్పాట్లు, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ లాంటివి కవర్‌ అవుతాయి. అలాగే కంఫర్ట్‌ ప్యాకేజీలో రైలులో 3AC బెర్త్‌, ఏసీ హోటల్‌లోఎ బస లభిస్తుంది.

ప్యాకేజీ వివరాలు

► ఏప్రిల్‌ 24వ తేదీన మొదటి రోజు పర్యాటకులు రేణిగుంట, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, నల్గొండ, సికింద్రాబాద్‌, పెద్దపల్లి, కాజీపేట, రామగుండం రైల్వే స్టేషన్‌లలో టూరిస్ట్‌ రైలు ఎక్కాల్సి ఉంటుంది.

► 25న రెండో రోజు రైలు ఆగ్రాకు చేరుకుంటుంది. రాత్రికి ఆగ్రాలో బస చేయాలి.

► ఏప్రిల్‌ 26న మూడో రోజు పర్యాటకులు ఆగ్రాలో తాజ్‌మహల్‌, ఆగ్రా పోర్ట్‌ చూడవచ్చు. ఆ తర్వాత మథురకు తీసుకెళ్తారు. అక్కడ కృష్ణ జన్మభూమి సందర్శించాలి. తర్వాత మథుర నుంచి బయలుదేరుతారు.

► ఏప్రిల్‌ 27న నాలుగో రోజు సాయంత్రానికి పర్యాటకులు కాట్రా చేరుకుంటారు.

► ఏప్రిల్‌ 28న ఐదో రోజు మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించుకోవాలి. అక్కడ పోనీ, డోలీ, హెలికాప్టర్‌ లాంటి సర్వీసులను పర్యాటకులు సొంత ఖర్చుతో పొందాల్సి ఉంటుంది. హెలికాప్టర్‌ సర్వీస్‌ కావాలంటే రెండు నెలల ముందే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

► 29న ఆరో రోజు కాట్రా నుంచి బయలేదేరి ఆ తర్‌వాత జలంధర్‌ చేరుకుంటారు. రోడ్డు మార్గంలో అమృత్‌సర్‌ బయలుదేరాలి.ఆ తర్వాత జలంధర్ చేరుకుంటారు. రోడ్డు మార్గంలో అమృత్‌సర్ బయల్దేరాలి. గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్ సందర్శించొచ్చు. తిరిగి జలంధర్ చేరుకున్న తర్వాత రైలు ప్రయాణం మొదలవుతుంది.

► ఏప్రిల్ 30- ఏడో రోజు హరిద్వార్ చేరుకుంటారు. అక్కడ గంగానదిలో స్నానం చేయొచ్చు. ఆ తర్వాత మానస దేవీ మంది ఆలయాన్ని సందర్శించాలి. సాయంత్రం గంగా హారతి కార్యక్రమానికి హాజరు కావొచ్చు. ఆ తర్వాత హరిద్వార్ నుంచి బయల్దేరాలి.

► మే 1- ఎనిమిదో రోజు ఢిల్లీ సఫ్దర్ గంజ్ చేరుకుంటారు. ఎర్రకోట, రాజ్ ఘాట్, ఇందిరా మెమొరియల్, అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించొచ్చు.

► మే 2- తొమ్మిదో రోజు ఢిల్లీలో కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, ఇండియా గేట్ సందర్శించొచ్చు. ఆ తర్వాత షాపింగ్ కోసం సమయం దొరుకుతుంది.

► మే 3- పదో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది.

► మే 4- పదకొండో రోజు పర్యాటకులు రామగుండం, కాజిపేట్, పెద్దపల్లి, సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వేస్టేషన్లలో దిగొచ్చు.

ఇవీ చదవండి : PM Kisan Samman Nidhi: రైతులకు డబుల్‌ బెనిఫిట్స్‌.. మార్చి 31లోగా చేరండి.. బ్యాంకు ఖాతాలో రూ.4 వేలు పొందండి

Provident Fund (PF): ఉద్యోగులు అలర్డ్‌.. మీరు ఈ పనులు చేయకపోతే పీఎఫ్‌ డబ్బులు తీసుకోలేరు

Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!