AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office PPF: రోజుకు రూ.411 కడితే.. చేతికి రూ.43 లక్షలు.. పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్

మీ పొదుపు సురక్షితంగా ఉండాలి.. భవిష్యత్తులో ఎక్కువ రాబడి రావాలని అనుకుంటున్నారా..? పోస్టాఫీసు యొక్క ఈ పథకం మీకు బెస్ట్ ఛాయిస్. పన్ను ఆదా, రిస్క్ లేని పెట్టుబడి, మంచి రాబడి ఈ పథకం అందిస్తుంది. రూ.411 పెట్టుబడితో రూ.43లక్షలు పొందవచ్చు. ఈ పథకం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Post Office PPF: రోజుకు రూ.411 కడితే.. చేతికి రూ.43 లక్షలు.. పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్
PPF Scheme
Krishna S
|

Updated on: Aug 02, 2025 | 3:05 PM

Share

పోస్ట్ ఆఫీస్‌లో ఎన్నో బెస్ట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ పథకాల వైపు మళ్లుతున్నారు. పోస్టాఫీస్ స్కీమ్స్ రిస్క్ లేకుండా ఉండడమే దీనికి కారణం. దీంతో దేశవ్యాప్తంగా పోస్టాఫీస్ పథకాల్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. మీరు పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ సమయంలో మంచి ఇన్‌కమ్ పొందాలనుకుంటే.. పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం బెస్ట్ చాయిస్. కేవలం రూ.411 పెట్టుబడితో 43లక్షలు పొందవచ్చు. పన్ను ఆదా చేయాలనుకునే వారికి ఈ పథకం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రూ. 411 డిపాజిట్‌తో రూ. 43 లక్షలు

పీపీఎఫ్ అకౌంట్ 15 ఏళ్ల కాల వ్యవధితో ఉంటుంది. దీంట్లో పెట్టుబడి పెడితో ప్రస్తుతం 7.9 వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో.. ఏడాదికి కనీసం రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రతి నెలా రూ. 12,500 అంటే రోజుకు దాదాపు రూ. 411 కడితే.. ఒక ఏడాదిలో మొత్తం రూ. 1.5 లక్షలు జమ అవుతాయి. 15 ఏళ్ల తర్వాత దాదాపు రూ. 43.60 లక్షలు పొందవచ్చు. దీంట్లో దాదాపు రూ. 21 లక్షలు వడ్డీ రూపంలో అందుతాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే.. వీటికి పన్ను ఉండదు. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ఈ పన్ను మినహాయింపు ఉంటుంది.

100శాతం డబ్బు సురక్షితం

ఈ పథకానికి ప్రభుత్వ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం. పీపీఎఫ్‌పై వడ్డీ రేటు కూడా బ్యాంక్ ఎఫ్‌డీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టే వారికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు. దీనిలో డబ్బు డిపాజిట్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు కోరుకుంటే మొత్తం డబ్బును ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు. లేదా నెలవారీగా కట్టొచ్చు.

పీపీఎఫ్ ఖాతాలో రుణం

మీరు అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి ఐదేళ్లలో రుణం తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పీపీఎఫ్‌లో ఆన్‌లైన్‌లో డబ్బు జమ చేసే సౌకర్యాన్ని కూడా పోస్టాఫీసు అందుబాటులోకి తెచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేదా DakPay యాప్ సహాయంతో మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పీపీఎఫ్ ఖాతాకు ఈజీగా డబ్బును బదిలీ చేయవచ్చు. దీని కోసం.. IPPB అకౌంట్‌ను మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. తర్వాత యాప్‌లో పీపీఎఫ్ ఆప్షన్‌ను ఎంచుకుని.. అకౌంట్ నంబర్, కస్టమర్ ఐడీని నమోదు చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది. మీ డబ్బు సేఫ్‌గా ఉండాలి.. భవిష్యత్తులో అధిక మొత్తంలో రావాలని అనుకునేవాళ్లకు ఇది గొప్ప పథకంగా చెప్పొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
గురు మౌఢ్య త్యాగంతో ఆ రాశులకు మహర్దశ.. వారికి ఆకస్మిక ధనలాభం
గురు మౌఢ్య త్యాగంతో ఆ రాశులకు మహర్దశ.. వారికి ఆకస్మిక ధనలాభం