Business Idea: ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం.. వాడిపడేసిన ప్లాస్టిక్ పెట్టుబడి..
మీరు కూడా అలాంటిదే ఏదైనా కొత్తగా చేద్దామనే ఆలోచనలో ఉన్నారా.? అయితే మీకోసం ఓ సరికొత్త బిజినెస్ ఐడియాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇంతకీ ఏంటా బిజినెస్..? పెట్టుబడి ఎంత అవసర పడుతుంది.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వాడి పడేసిన ప్లాస్టిక్‌ను పెట్టుబడి అస్త్రంగా మార్చుకొని కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు...
ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో చాలా మంది ఉంటారు. అయితే పెట్టుబడికి భయపడి చాలా మంది భయపడుతుంటారు. అలాగే అప్పటికే ఉన్న పోటీకి భయపడి మరికొందరు వెనుకబడుగు వేస్తుంటారు. అయితే వినూత్నంగా ఆలోచించాలే కానీ వ్యర్థం నుంచి కూడా అద్భుతం సృష్టించవచ్చని కొందరు నిరూపించారు.
మీరు కూడా అలాంటిదే ఏదైనా కొత్తగా చేద్దామనే ఆలోచనలో ఉన్నారా.? అయితే మీకోసం ఓ సరికొత్త బిజినెస్ ఐడియాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇంతకీ ఏంటా బిజినెస్..? పెట్టుబడి ఎంత అవసర పడుతుంది.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వాడి పడేసిన ప్లాస్టిక్‌ను పెట్టుబడి అస్త్రంగా మార్చుకొని కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఎందుకు పనికిరాని ప్లాస్టిక్‌తో ఏం చేస్తున్నారనేగా మీ సందేహం. ప్లాస్టిక్‌తో టైల్స్ తయారీ ఒక మంచి బిజినెస్ ప్లాన్‌గా మార్చుకోవచ్చు.
ఓవైపు ప్రకృతిని కాపాడుతూనే మరో వైపు లాభాలు ఆర్జించవచ్చు. ఇప్పటికే పలువురు ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్‌ను కవర్స్‌ను సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లాస్టిక్‌ను ఒక ముద్దలా మారుస్తారు. అనంతరం ఈ మిశ్రమంలో ఇసుక కలిపి టైల్స్‌ను తయారు చేస్తారు. ఇందుకోసం త్వరగా మెల్ట్ అయ్యే ప్లాస్టిక్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వేడి చేసిన తర్వాత ముద్దగా అయ్యే మెటిరీయల్‌ను టైల్ తయారీ మిషన్‌తో ఎంచక్కా టైల్స్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించడం వల్ల మీతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించచ్చు.
ఇదిలా ఉంటే ఈ వ్యాపారానికి పెట్టుబడి కేవలం టైల్స్ తయారీ మిషన్స్ మాత్రమే అవుతుంది. ప్లాస్టిక్ ఎలాగో ఉచితంగా లభిస్తుంది. ఇందుకోసం మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలో ఒప్పందం చేసుకొని ప్లాస్టిక్‌ను సేకరిస్తే సరిపోతుంది. ప్లాస్టిక్‌తో టైల్స్ తయారు చేసిన పలువురికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి ఈ వ్యాపారాన్ని మీరు కూడా ప్రారంభించొచ్చు. ఇక ఈ వ్యాపారిన్ని పారంభించేందుకు ప్రభుత్వాలు రుణాలు సైతం అందిస్తున్నాయి. ముద్ర యోజన లోన్ ద్వారా టైల్స్ తయారీ ఏర్పాటుకు సరిపడ పెట్టుబడిని రుణం రూపంలో పొందొచ్చు. ఇక టైల్స్ తయారీని కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..