AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఎన్‌బీఎఫ్‌సీలకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. ఇక రుణం రూ. 20వేలలోపే ఉండాలి! పూర్తి వివరాలు

కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఎకానమీపై ఫోకస్ పెట్టింది. అంతకు ముందు రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు సమయంలో ఏర్పడిన నగదు కొరతను తీర్చేందుకు అన్నింటా ఆన్ లైన్ సర్వీసులను వినియోగంలోకి తీసుకొచ్చారు. అయితే ఇటీవల మళ్లీ మార్కెట్లో నగదు చలామణీ పెరిగింది. దీంతో నగద చలామణీ కట్టడికి ఈ నిబంధనను తెరపైకి తెచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

RBI: ఎన్‌బీఎఫ్‌సీలకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. ఇక రుణం రూ. 20వేలలోపే ఉండాలి! పూర్తి వివరాలు
మీరు వ్యాపారం ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనలో ఉన్న చిన్న టాలెంట్‌తో కూడా లక్షల్లో సంపాదించవచ్చు.
Madhu
|

Updated on: May 09, 2024 | 4:47 PM

Share

బ్యాంకింగ్ రంగం డిజిటల్ బాటలో వేగంగా పరుగులు పెడుతోంది. భారత ప్రభుత్వం ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే మారుమూల గ్రామాలకు కూడా డిజిటల్ లావాదేవీలు అలవాటు అయిపోయాయి. వీలైనంత వరకూ మార్కెట్లో నగదు చలామణీని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల మళ్లీ నగదు ప్రవాహం మార్కెట్లో పెరుగుతోంది. ఈ క్రమంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు నగదు రూపంలో రుణాన్ని రూ. 20,000లోపే పరిమితం చేయాలని సూచించింది. ముఖ్యంగా బంగారు రుణాలపై ఈ పరిమితిని మించకూడదని ఆదేశించింది. ఆదాయపు పన్ను చట్టం1961లోని సెక్షన్ 269 ఎస్ఎస్ ప్రకారం ఏ వ్యక్తికీ రూ. 20,000 కంటే ఎక్కువ నగదును రుణంగా అందించకూడదని స్పష్టం చేసింది. స్వీకరించకూడదని నిర్దేశిస్తుంది. ఎన్బీఎఫ్సీలు గోల్డ్ లోన్ కు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ నిబంధనల వెనుక ఆర్బీఐ వ్యూహం ఏమిటి? దీనికి కారణాలు ఏమిటి? ప్రజలపై భారం ఎలాం ఉంటుంది? తెలుసుకుందాం రండి..

కారణాలు ఇవేనా..

కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఎకానమీపై ఫోకస్ పెట్టింది. అంతకు ముందు రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు సమయంలో ఏర్పడిన నగదు కొరతను తీర్చేందుకు అన్నింటా ఆన్ లైన్ సర్వీసులను వినియోగంలోకి తీసుకొచ్చారు. అయితే ఇటీవల మళ్లీ మార్కెట్లో నగదు చలామణీ పెరిగింది. దీంతో నగద చలామణీ కట్టడికి ఈ నిబంధనను తెరపైకి తెచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ ఏడాది మార్చిలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ను ఆర్బీఐ నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. రుణాల మంజూరులో భారీ అవకతవకలను ఆర్బీఐ గుర్తించింది. బంగారం నాణ్యతను నిర్ధారించడం, తూకం. నగదు రుణాల పరిమితిలో ఆ సంస్థ నిబంధనలు అస్సలు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త కస్టమర్లకు బంగారంపై రుణాలను ఇవ్వొద్దని ఆ సంస్థను నిషేధించింది. ఈ పరిణామం కూడా ఎన్బీఎఫ్సీలపై నిబంధనలను కఠిన తరం చేయడానికి ఓ కారణంగా చెబుతున్నారు.

బ్యాంక్ బరోడా వినియోగదారులకు గుడ్ న్యూస్..

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) వినియోగదారులకు డిజిటల్ యాప్ బీవోబీ వరల్డ్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఆర్బీఐ దీనిపై విధించిన ఆంక్షలను ఎత్తేసింది. యాప్ పర్యవేక్షణ లోపాలను చూపిస్తూ గత ఏడాది అక్టోబర్ 10న ఆ యాప్ లోకి కొత్త ఖాతాదారుల రాకపై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. అయితే ఇది ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..