Indian Railways: ఈ రైళ్లు 9 రోజుల పాటు రద్దు.. కారణాలు వెల్లడించిన రైల్వే అధికారులు

ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త కొత్త రైళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా ట్రాక్‌ మరమ్మతులను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. ప్రయాణికుల రద్దీని..

Indian Railways: ఈ రైళ్లు 9 రోజుల పాటు రద్దు.. కారణాలు వెల్లడించిన రైల్వే అధికారులు
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Jan 22, 2023 | 8:59 AM

ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త కొత్త రైళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా ట్రాక్‌ మరమ్మతులను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోజురోజుకు రైళ్ల సంఖ్యను పెంచుతోంది ఇండియన్‌ రైల్వే. అయితే రైల్వే ట్రాక్‌ మరమ్మతులు, ఇతర కారణాల వల్ల కొన్ని రైళ్లను రద్దు చేస్తుంటుంది. అలాగే మరికొన్ని రైళ్ల సమయాల వేళల్లో మార్పులు, మరికొన్ని రైళ్లను దారి మళ్లించడం వంటివి చేస్తుంటుంది. ఇందులో భాగంగా పలు రైళ్లు 9 రోజుల పాటు రద్దు చేస్తోంది. దీంతో ముందస్తుగా ప్రయాణికులను అప్రమత్తం చేస్తోంది. సెంట్రల్‌ రైల్వే పరిధిలోని దౌండ్‌-మన్మాడ్‌ నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

దౌండ్‌ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే డెమొ రైలు జనవరి 20 నుంచి 28వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు, ఇది 9 రోజుల పాటు అందుబాటులో ఉండదని రైల్వే అధికారులు తె లిపారు. అలాగే నిజామాబాద్‌ నుంచి పుణె వెళ్లే డెమో రైలు జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉండదు. దీనిని కూడా రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే నిజామాబాద్‌-పండలిపూర్‌ వెళ్లే డెమో రైలు జనవరి 21 నుంచి అందుబాటులో ఉండదు. దీనిని రద్దు చేశారు. అలాగే న్యూఢిల్లీ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలును మన్మాడ్‌, జగత్‌పురి, కల్యాణ్‌, పన్నేల్‌, పుణె, దౌండ్‌ మార్గాల్లో వివిధ కారణాల వల్ల దారి మళ్లించారు. జనవరి 27వ తేదీ నుంచి నడిచే బెంగళూరు-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును పుణెన, లోనావాలా, కజ్రత్‌, పన్వేల్‌, వాసాయ్‌ రోడ్‌, వడోదరా, రత్లామ్‌, మక్కి, సంత్‌ హిర్‌ధరమ్‌ మార్గంలో దారి మళ్లించారు. ఇక షిర్డీ నుంచి ఏపీ, తెలంగాణకు వచ్చే రైళ్లు ఈనెల 23 నుంచి 26 వరకు ఆలస్యంగా నడవనున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు రైల్‌ సేవాను సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?