Indian Railway: రైల్వే ఆదాయంలో 49 శాతం పెరుగుదల.. 8 నెలల్లో రూ.14184 కోట్ల ఆదాయం
Indian Railway: భారతీయ రైల్వేల తూర్పు మధ్య రైల్వే ఆదాయం మరింతగా పెరిగింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 మొదటి 8 నెలలకు..
Indian Railway: భారతీయ రైల్వేల తూర్పు మధ్య రైల్వే ఆదాయం మరింతగా పెరిగింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 మొదటి 8 నెలలకు అంటే ఏప్రిల్ 2021 నుండి నవంబర్ 2021 వరకు రూ.14184.38 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాజేష్ కుమార్ వెల్లడించారు. రైల్వేల ఈ ఆదాయం గతేడాది నవంబర్ వరకు వచ్చిన రూ.9534.19 కోట్లతో పోలిస్తే 48.77 శాతం ఎక్కువ. ప్రయాణికుల రాకపోకలు, సరుకు రవాణా సహా అన్ని ఇతర వనరుల నుంచి తమ ఆదాయం పొందినట్లు తూర్పు మధ్య రైల్వే తెలిపింది.
ప్రయాణికుల సేవలో గతేడాదితో పోలిస్తే రెట్టింపు ఆదాయం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ నెల వరకు ప్రయాణికుల రద్దీ ద్వారా రూ.1620.11 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది నవంబర్ వరకు వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈ ఆదాయం దాదాపు రెట్టింపు. అయితే ఈ ఏడాది నవంబర్‌లో మాత్రమే ప్రయాణికుల నుండి రూ. 224.05 కోట్లు వచ్చాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో ప్రయాణికుల నుండి వచ్చిన ఆదాయం కంటే 87.44 శాతం ఎక్కువ అని రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాజేష్ కుమార్ తెలిపారు.
సరుకు రవాణాతో పెరిగిన ఆదాయం
ప్రయాణికులతో పాటు సరుకు రవాణా రంగంలో ఉత్తర మధ్య రైల్వే ఆదాయంలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. నవంబర్ 2021-22 నాటికి తూర్పు మధ్య రైల్వే 104.56 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 86.76 మిలియన్ టన్నుల సరుకు రవాణా లోడింగ్ కంటే 20.52 శాతం ఎక్కువ. ఈ సరకు రవాణా ద్వారా ఈస్ట్ సెంట్రల్ రైల్వే ద్వారా 12316.20 కోట్లు అందాయి. ఇది గత సంవత్సరం కంటే 39.25 శాతం పెరిగింది. అదే క్రమంలో ఇతర కోచింగ్‌ల ద్వారా పొందిన ఆదాయంలో కూడా 126 శాతం పెరుగుదల నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం నవంబర్ నెల వరకు ఇతర కోచింగ్‌ల ద్వారా వచ్చిన రూ. 66.57 కోట్లతో పోలిస్తే ఇది రూ. 150.73 కోట్లుగా ఉంది.
ఇవి కూడా చదవండి: