- Telugu News Photo Gallery Business photos Ujjivan Small Finance Bank raises Term Deposit interest rates, offers up to 7.35 per cent for senior citizens
Fixed Deposit: ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్‌న్యూస్.. వడ్డీ రేటు పెంపు..!
Fixed Deposit: ప్రస్తుతం చేతిలో డబ్బులు ఉండి ఇన్వెస్ట్ చేసేవారికి మంచి లాభాలు ఉన్నాయి. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడి పొందవచ్చు. తాజాగా ఓ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి..
Subhash Goud | Edited By: Ravi Kiran
Updated on: Dec 11, 2021 | 6:36 AM

Fixed Deposit: ప్రస్తుతం చేతిలో డబ్బులు ఉండి ఇన్వెస్ట్ చేసేవారికి మంచి లాభాలు ఉన్నాయి. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడి పొందవచ్చు. తాజాగా ఓ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తోంది.

ప్రముఖ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. పెంచిన వడ్ఈ రేట్లు డిసెంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చాయి. 60 సంవత్సరాల్లోపు ఉన్న వారికి 6.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.

19 నెలల నుంచి 24 నెలల కాలపరిమితితో ఎఫ్‌డీలపై ఈ వడ్డీ రేటు అందిస్తోంది. అలాగే ఏడాది కాలపరిమితితో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6 శాతం ఉన్న వడ్డీ రేటు ప్రస్తతం 6.5 శాతానికి పెంచింది.

అలాగే సీనియర్ సిటిజన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి రాబడి ఉంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే వీరికి 75 శాతం వేసిక్ పాయింట్లతో వడ్డీ రేటు ఉంది. 19 నెలల నుంచి 24 నెలల కాలపరిమితితో ఎఫ్‌డీలపై 7.35 శాతం వడ్డీ రేటు ఉంది. ఏడాది కాలపరిమితితో 7.25 శాతం ఉంది.





























