- Telugu News Photo Gallery Business photos Google storage: google photos alternatives some of the best free options
Google Photos: మీ ఫోన్‌లో స్టోరేజీ పూర్తిగా నిండిపోయిందా..?టెన్షన్ అవసరం లేదు.. ఈ యాప్స్‌లో ట్రై చేయండి..!
Google Photos: సాధారణంగా ఆండ్రాయిడ్, యాపిల్ మొబైల్‌లలో యూజర్లు డాటాను స్టోర్ చేసుకోవడానికి ఉచిత స్టోరేజీ ఉంటుందనే విషయం తెలిసిందే. గూగుల్ తరపున గూగుల్ ఫోటోస్‌ను స్టోర్ చేసుకోవడానికి ..
Updated on: Dec 12, 2021 | 6:09 AM

Google Photos: సాధారణంగా ఆండ్రాయిడ్, యాపిల్ మొబైల్‌లలో యూజర్లు డాటాను స్టోర్ చేసుకోవడానికి ఉచిత స్టోరేజీ ఉంటుందనే విషయం తెలిసిందే. గూగుల్ తరపున గూగుల్ ఫోటోస్‌ను స్టోర్ చేసుకోవడానికి 15 జీబీల స్పేస్ ఉచితంగా ఉంటుంది. 15జీబీల కంటే ఎక్కువ అవసరమైతే డబ్బులు పెట్టి కొనాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం బెటర్. ఇందు కోసం కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫొటోలు, డాటాను స్టోర్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

టెరాబాక్స్ (డూబాక్స్): గూగుల్ ఫొటోస్‌కు ఇది ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ యాప్‌లో 1టీబీ(వెయ్యి జీబీ) ఉచిత స్టోరేజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫైల్స్, ఫొటోస్, వీడియోలు, ఫోల్డర్‌లు ఏవైనా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అయితే వీడియోలు ఆటోమేటిక్‌గా బ్యాక్‌ప్‌లోకి వెళ్లాలంటే మాత్రం.. ప్రీమియం మెంబర్‌షిప్ తప్పనిసరి. ఇక ఫొటోలను మాత్రం ఉచితంగా బ్యాకప్ చేసుకునేందుకు ఎనేబుల్ బటన్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది.

జియోక్లౌడ్: గూగుల్ ఫొటోస్‌కు మరో ఉచిత అవకాశం ఇది. జియో ద్వారా క్లౌడ్ స్టోరేజ్ 50జీబీ ఉచిత స్టోరేజ్ ఇస్తుంది. రిఫరెన్స్, ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఫ్రీ స్టోరేజ్‌ను పొందవచ్చు.

అమెజాన్ ఫొటోస్ యాప్: అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కొంత మంది వినియోగదారులకే అందించే యాప్ ఇది. గూగుల్‌ప్లే స్టోర్‌లో కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందిస్తోంది. 5జీబీ వరకు వీడియోలను ఇందులో అప్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫొటోలకు మాత్రం పరిమితి ఉండదు. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫ్రీ అన్‌లిమిటెడ్ స్టోరేజ్ సౌకర్యం ఉంది.





























