PF Withdrawal: మీ పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలా..? ఎన్ని రోజులు పడుతుంది..? పూర్తి వివరాలు..!
PF Withdrawal: కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మంది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. గతంలో వైరస్ ఆర్థిక సంక్షోభం సృష్టించిన విషయం తెలిసిందే..
PF Withdrawal: కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మంది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. గతంలో వైరస్ ఆర్థిక సంక్షోభం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలాంటి కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకునేవి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్‌లోని డబ్బులే. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చిన సమయంలో పీఎఫ్ డబ్బుల వైపే చూస్తుంటారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కూడా ఈ పీఎప్ ఖాతాదారులకు పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. కరోనా సంక్షోభంలోనే కాదు వివాహాలు, పిల్లల చదువులు, స్థిరాస్తి కొనుగోలు, హోమ్ లోన్ రీపేమెంట్, వైద్య అవసరాలు ఇలా ఎన్నో రకాలుగా ఈపీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
అయితే ఉద్యోగాలు చేసే వ్యక్తుల కోసం పీఎఫ్ ఖాతా ( Provident Fund) వారి భవిష్యత్ భద్రతకు చాలా సహాయకారిగా ఉంటుంది. మీ పీఎఫ్ డబ్బును అవసరమైతే ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. కానీ చాలా సార్లు పీఎఫ్ ఖాతా నుండి డబ్బు ఎలా ఉపసంహరించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత ఎన్ని రోజులకు డబ్బులు ఉపసంహరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి..? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఈపీఎఫ్‌ఓ వినియోగదారులకు చివరి పీఎఫ్ కోసం దరఖాస్తు చేయడానికి 60 రోజులు సమయం ఉంటుంది. ఆన్‌లైన్‌లో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
► ఉద్యోగం వదిలి రెండు నెలల తర్వాత లేదా పదవీ విరమణ చేసిన తరువాత మాత్రమే ఫైనల్ పిఎఫ్ కోసం ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.
► చివరి పరిష్కారం కోసం ముందుగా తన మొబైల్ నంబర్‌ను అందించాలి.
► ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో (ఈపీఎఫ్ సభ్యుల పోర్టల్‌లో) ఆఫ్‌లైన్‌లో కూడా నింపవచ్చు.
► తుది పరిష్కారం కోసం పాన్ తప్పనిసరి.
► ఆఫ్‌లైన్ సెటిల్మెంట్ ప్రక్రియ కోసం పని చేసిన సంస్థ సంతకం మరియు సంస్థ యొక్క స్టాంప్ తప్పనిసరి ఉండాలి.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి..
మీరు ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరు మీ పీఎఫ్ ఖాతాను పరిష్కరించుకోవచ్చు. లేదా కొత్త సంస్థలో కొత్త ఈపీఎఫ్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. మీరు తుది పరిష్కారం చేయాలనుకుంటే మీరు ఫారం 19ని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో నింపవచ్చు. ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించడానికి మీరు ఈ కింది నియమాలు పాటించాల్సి ఉంటుంది.
► ఈపీఎఫ్ (EPF) సభ్యుల పోర్టల్‌లో మీ UAN ఖాతాకు లాగిన్ కావాలి.
► ఆన్‌లైన్ సేవల విభాగంలో ఫారం 31, 19 అండ్ 10 సి పై క్లిక్ చేయండి.
► మీ లింక్డ్ బ్యాంక్ ఖాతా యొక్క చివరి 4 అంకెలను నమోదు చేసి ధృవీకరించినట్లుగా(accepted) పై క్లిక్ చేయండి.
► అండర్టేకింగ్ సర్టిఫికేట్(undertaking certificate)పై సంతకం చేయడానికి అవును క్లిక్ చేయండి.
► డ్రాప్-డౌన్ మెను నుంచి పీఎఫ్ ఉపసంహరణ (ఫారం -19) మాత్రమే ఎంపికను ఎంచుకోండి.
► ఇక్కడ మీ పూర్తి చిరునామాను ఇవ్వాల్సి ఉంటుంది. నిరాకరణను టిక్ చేసి, GET AADHAAR OTP పై క్లిక్ చేయండి.
► ఆధార్ (UIDAI)తో నమోదు చేయబడిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. తర్వాత ఓటీపీని నమోదు చేయాలి.
► మీ దరఖాస్తును విజయవంతంగా సమర్పించిన తర్వాత మీకు OTP సంఖ్య వస్తుంది.
► ఉపసంహరణ మొత్తం 15-20 రోజులలోపు మీ UANతో అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది.
ఇవి కూడా చదవండి: