Bank Account: మీకు ఇలాంటి బ్యాంకు ఖాతాలు ఉన్నాయా..? వెంటనే మూసివేయండి..!

Bank Account: చాలా మందికి ఉద్యోగంలో భాగంగా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక ఖాతాలు ఉంటాయి. ఒక సంస్థలో పని చేసినప్పుడు ఒక బ్యాంకు ఖాతా ఉంటే.. మరో ఉద్యోగానికి..

Bank Account: మీకు ఇలాంటి బ్యాంకు ఖాతాలు ఉన్నాయా..? వెంటనే మూసివేయండి..!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 10, 2021 | 6:53 AM

Bank Account: చాలా మందికి ఉద్యోగంలో భాగంగా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక ఖాతాలు ఉంటాయి. ఒక సంస్థలో పని చేసినప్పుడు ఒక బ్యాంకు ఖాతా ఉంటే.. మరో ఉద్యోగానికి బదిలీ అయినప్పుడు ఆ కంపెనీలు మరో బ్యాంకు ఖాతాను అందిస్తుంటాయి. ఇలా జాబ్‌ మారుతున్నకొద్ది బ్యాంకు అకౌట్లు కూడా మారుతుంటాయి. కానీ గతంలో ఉన్న బ్యాంకు ఖాతాలను వాడకుంటే అలాగే వదిలేస్తుంటారు. ఎప్పటికప్పుడు ఖాతాలు చెక్‌ చేసుకోవడం మంచిది. కార్యకలాపాలు కొనసాగించడం కష్టంతో కూడిన వ్యవహారం. పైగా వాటిలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉంచడం తప్పనిసరి. అలా చేయకపోతే పెనాల్టీలు పడతాయి. దీనివల్ల క్రెడిట్‌ స్కోర్‌పైనా ప్రభావం పడుతుంది. అందుకే కొత్త ఖాతా తీసుకున్నప్పుడు పాతది మూసేయడం మంచిది.

డీ-లింక్‌ చేయడం..

మీరు ఏ బ్యాంకు ఖాతా మూసివేయాలని అనుఎకున్నా ఏదైనా చెల్లింపుల సేవకు అంటే ఫండ్స్‌ ఇండియా, పేటీఎం, స్విగ్గి, ఉబర్‌ వంటి ఖాతాలకు అనుసంధానం చేసి ఉంటే వాటిని డీ-లింక్‌ చేయాలి. యూఐపీఐ పేమెంట్స్‌ ఉంటే వాటని డీ-లింక్‌ చేయాలి. యూపీఐ పేమెంట్స్ మీ ఫోన్‌తో అనుసంధానం చేసి ఉంటాయి. అందుకే మొద‌ట వాటిని డీ-లింక్ చేయాల‌న్న విష‌యం గుర్తుంచుకోండి. దానికి బ‌దులుగా మీరు కొన‌సాగించాల‌నుకున్న అకౌంట్‌ను అనుసంధానం చేస్తే చెల్లింపుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉంటుంది. కొన్ని ఫ్లాట్‌ఫామ్‌లు డీ-లింక్‌ ఫారంను కూడా అడుగుతాయి.

బ్యాంకు క్లోజర్‌ ఫారం..

అన్ని బ్యాంకులు క్లోజ‌ర్ ఫారంను అందిస్తాయి. బ్యాంకు శాఖ లేదా వెబ్‌సైట్ ద్వారా దీనిని పొందవచ్చు. ఉమ్మడి అకౌంట్‌ అయితే అంద‌రూ దీనికి స‌మ్మతి తెలుపాల్సి ఉంటుంది. ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసేందుకు మ‌రొక ఫారంలో ఖాతా నంబ‌ర్‌ను జ‌త చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

బ్యాంకు డాక్యుమెంట్లు..

బ్యాంకు జారీ చేసిన‌ చెక్కు బుక్కుల‌ను, డెబిట్‌, క్రెడిట్ కార్డులు, పాస్‌బుక్‌, ఇత‌ర డాక్యుమెంట్లను తిరిగి ఇచ్చేయాలని కోరవచ్చు. ఖాతా క్లోజ‌ర్ ఫారంతో పాటు ఇవ‌న్నీ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఈ డాక్యుమెంట్లను చింపేయాల్సిందిగా సూచిస్తారు.

బ్యాంకు ఛార్జీలు..

అకౌంట్‌ ప్రారంభించిన ఏడాదిలోగా మూసేస్తే బ్యాంకులు ముగింపు ఛార్జీల‌ను వ‌సూలు చేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్‌బీఐ ఖాతా ప్రారంభించిన 14 రోజుల్లో మూసివేస్తే ఛార్జీలు లేవు. 15వ రోజు నుంచి ఏడాదిలోపు మూసివేస్తే రూ.500 ఛార్జీల‌తో పాటు జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. సంవత్సరం దాటితే మ‌ళ్లీ ఎలాంటి రుసుములూ ఉండ‌వు. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్రకారం బ్యాంకులు స్వతంత్రంగా ఈ ముగింపు ఛార్జీల‌ను విధించుకోవ‌చ్చు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన త‌ర్వాత బ్యాంకుకు చెల్లించాల్సిన‌ ఏవైనా పెండింగ్ ఛార్జీలు ఉంటే తనిఖీ చేస్తాయి. అకౌంట్‌ ఖాతా ముగించిన‌ట్లు బ్యాంకు వ‌ద్ద అక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకోవడం తప్పనిసరి. ఇవ‌న్నీ స‌రైన విధానంలో చేసి అవ‌స‌రం లేని ఖాతాల‌ను మూసివేస్తేనే ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Insurance Policy: మీరు బీమా పాలసీ తీసుకుంటున్నారా..? వాటి గురించి ముందుగానే చెప్పేయండి..లేకపోతే ఇబ్బందే..!

Credit, Debit Cards: మీ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డును లాక్‌ చేసుకోవడం ఎలా..? కార్డును ఎలా సెట్‌ చేసుకోవాలి..!

టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!