Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock market: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. 15 రోజుల్లో లక్షా 50 వేలు వచ్చాయి..

గత నెల రోజులుగా స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులను చవిచూస్తోంది. ఏడాది పొడవునా లాభాలను అందించిన సెన్సెక్స్ రాబడులు గత నెల రోజులుగా ప్రతికూలంగా ఉన్నాయి....

Stock market: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. 15 రోజుల్లో లక్షా 50 వేలు వచ్చాయి..
Vi
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 10, 2021 | 6:59 AM

గత నెల రోజులుగా స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులను చవిచూస్తోంది. ఏడాది పొడవునా లాభాలను అందించిన సెన్సెక్స్ రాబడులు గత నెల రోజులుగా ప్రతికూలంగా ఉన్నాయి. అయితే, కొన్ని స్టాక్‌లు పూర్తి భిన్నంగా పని చేస్తున్నాయి. అందులో ఒకటి వోడాఫోన్ ఐడియా. కేవలం 15 రోజుల్లోనే ఈ షేరు 50 శాతానికి పైగా లాభపడింది. వోడాఫోన్ ఐడియా స్టాక్ నవంబర్ 26న 10.86 వద్ద ముగిసింది. గురువారం ఈ షేరు 16.43 స్థాయి వద్ద ముగిసింది. అంటే 15 రోజుల్లో ఈ షేరు 51 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే నవంబర్ 26న ఒక ఇన్వెస్టర్ స్టాక్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడి పెట్టుబడి మొత్తం రూ.1.5 లక్షలకు పైగా పెరిగింది. ఆగస్ట్ చివరి నుండి స్టాక్ స్థిరమైన లాభాలను అందిస్తోంది. ఆగస్టు చివరి నాటికి రూ. 1 లక్ష విలువైన వొడాఫోన్ ఐడియా షేర్లను కొనుగోలు చేసిన పెట్టుబడిదారుడి పెట్టుబడి విలువ ప్రస్తుతానికి రూ. 2.74 లక్షలు అయింది.

స్టాక్ ఎందుకు పెరిగింది?

ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న అనేక సానుకూల వార్తల కారణంగా స్టాక్‌లో ఈ వరుస లాభాలు నమోదయ్యాయి. AGR బకాయిలకు ప్రభుత్వం ఇప్పటికే 4 సంవత్సరాల మారటోరియం ఇచ్చింది. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీకి పెద్ద ఊరట లభించింది. దీనితో పాటు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు, లైసెన్స్ ఇతర ఛార్జీలకు సంబంధించి ప్రభుత్వం అనేక సంస్కరణ చర్యలను కూడా ప్రకటించింది. దీంతో ఈ రంగానికి సెంటిమెంట్లు మెరుగయ్యాయి. దీంతో బాండ్ హోల్డర్లకు వడ్డీ చెల్లించేందుకు ఆ మొత్తాన్ని కంపెనీ తిరిగి చెల్లించగలిగింది. డిసెంబర్ 13 నుంచి 2022 మార్చి వరకు కంపెనీ రూ.6000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం ఇన్వెస్టర్లు, రుణదాతలతో నిరంతరం చర్చలు జరుపుతున్న కంపెనీ.. ఇప్పుడు డబ్బును సమీకరించడంలో సఫలీకృతం కావడంతో ఆ తర్వాత స్టాక్ వృద్ధిని నమోదు చేసుకుంది.

అయితే తొందరపడి ఈ స్టాక్ కొనేయకండి.. ఎందుకంటే ఈ కంపెనీ ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూడుకుపోయింది. ఒకవేళ వారు అప్పు కట్టలేదని తెలిస్తే షేర్ ప్రైస్ భారీగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైనా స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడి పెట్టాలనుకుంటే నిపుణుల సలహాతో పెట్టుబడి పెట్టాలి. లేకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది.

Read Also.. Bank Account Aadhaar Link: మీ ఆధార్‌ నెంబర్‌ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్‌ అయ్యింది..? ఇలా తెలుసుకోండి..!