LIC: ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ వాటా పెంచుకునేందుకు ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్‌..!

LIC: ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో వాటాను 9.99 శాతం వరకు పెంచుకోవడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)కి ఆర్బీఐ అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం..

LIC: ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ వాటా పెంచుకునేందుకు ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్‌..!
Follow us

|

Updated on: Dec 12, 2021 | 6:19 AM

LIC: ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో వాటాను 9.99 శాతం వరకు పెంచుకోవడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)కి ఆర్బీఐ అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంకులో ఎల్‌ఐసీ 4.95 శాతం కలిగి ఉంది. దానిని 9.99 శాతం వరకు పెంచుకునేందుకు ఆర్‌బీఐ అనుమతి కోరింది. బీఎస్ఈ ఫైలింగ్‌లో బ్యాంక్… సెంట్రల్ బ్యాంక్ ఆమోదం గురించి రెండు రోజుల కిందట చెప్పిందని తెలిపింది. ‘ప్రైవేటు సెక్టార్ బ్యాంక్‌ల్లో యాజమాన్యం, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలకు అనుగుణంగా ఆమోదముంటుంది. ఈ ఆమోదం ఏడాది .. అంటే వచ్చే ఏడాది డిసెంబరు 8 వరకు చెల్లుబాటవుతుంది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం.. ప్రైవేటు బ్యాంకుల్లో 5 శాతానికి మించి వాటా పెంచుకోవాలంటే ఆర్బీఐ ఆమోదం తప్పనిసరి

ఇవి కూడా చదవండి:

Google Photos: మీ ఫోన్‌లో స్టోరేజీ పూర్తిగా నిండిపోయిందా..?టెన్షన్‌ అవసరం లేదు.. ఈ యాప్స్‌లో ట్రై చేయండి..!

LIC Scholarship 2021: విద్యార్థులకు శుభవార్త.. LIC స్కాలర్‌ షిప్‌కి అప్లై చేయండి.. ఏడాదికి రూ.20,000 పొందండి