AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Second Hand Bikes: సెకండ్ హ్యాండ్ బైక్‌లు కొనాలని చూస్తున్నారా? అలాంటి వారికోసమే ఈ సరికొత్త సమాచారం..

Second Hand Bikes: దేశంలో సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలు విపరీతంగా సాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో అన్నిరకాల..

Second Hand Bikes: సెకండ్ హ్యాండ్ బైక్‌లు కొనాలని చూస్తున్నారా? అలాంటి వారికోసమే ఈ సరికొత్త సమాచారం..
Second Hand Bikes
Shiva Prajapati
|

Updated on: Mar 12, 2021 | 4:43 PM

Share

Second Hand Bikes: దేశంలో సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలు విపరీతంగా సాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో అన్నిరకాల వాహనాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలు కంటే.. సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగులుపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ బైక్స్‌, కార్లు కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కొందరు కొత్త వాహనాలను కొనేందుకై తమ వద్ద ఉన్న పాత వాహనాలను అమ్మకానికి పెడుతున్నారు.

ఇదిలాఉంటే.. పాత కార్లు, బైకులు కొనుగోలు చేయడానికి మార్కెట్‌లో ఎన్నో ఆప్షన్స్‌ ఉన్నాయి. ఎవరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఆఫ్‌లైన్ ద్వారా, ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే, ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్‌ కార్ల కొనుగులుకు సంబంధించి చాలా వెబ్‌సైట్లు‌ అందుబాటులో ఉండగా.. ద్విచక్ర వాహనాల అమ్మకాల కోసం కొన్ని సైట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాంటి సైట్లలో బైక్‌ల కోసం ప్రధానంగా ఢిల్లీకి చెందిన Droom.in వెబ్‌సైట్‌ని ప్రధానంగా చెప్పుకొవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో చాలా ఆప్షన్స్‌తో పాటు.. అన్ని రకాల సెకండ్ హ్యాండ్ బైక్‌లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. అవి కూడా.. రూ. 20 నుంచి 25వేల లోపు బైక్‌లు ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్న కొన్ని బైక్‌ల వివరాలు ఇప్పుడు చూద్దాం.. హీరో స్ప్లెండర్ ఎన్ఎక్స్‌జి 100 సిసి: 2011 మోడల్‌కి చెందిన ఈ బైక్ ప్రస్తుతం అమ్మకానికి ఉంది. ఈ బైక్ మొత్తం 35,285 కి.మీ ప్రయాణించింది. ఇది లీటరుకు 65 కి.మీ మైలేజ్ ఇస్తోంది. దీని ఇంజిన్ కెపాసిటీ 100 సిసి. దీనిని రూ .19 వేలకు అమ్మకానికి పెట్టారు.

బజాజ్ డిస్కవర్ 125 ఎమ్: 2014 మోడల్ అయిన ఈ బైక్‌ను వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. 19,500 కి.మీ నడిచిన ఈ బైక్.. లీటరుకు 65 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ఇంజన్ కెపాసిటీ 125 సిసి. దీని ధరను రూ .24 వేలుగా నిర్ణయించారు.

హోండా డ్రీమ్ నియో 110 సిసి: 2013 మోడల్ బైక్‌ అయిన హోండా డ్రీమ్ నియోను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. ఇది ఇప్పటి వరకు 19,000 కి.మీ నడిచింది. లీటరుకు 84 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ 110 సిసి ఇంజన్ బైక్‌ను రూ .25 వేలకు అమ్మకానికి పెట్టారు.

గమనిక: పైన ఇచ్చిన బైకుల సమాచారం మరియు ధరలు డ్రూమ్ వెబ్‌సైట్ నుండి ఇవ్వబడ్డాయి. పాత బైక్‌లను కొనుగోలు చేసేటప్పుడు ఆ బైక్‌ ధృవీకరణ పత్రాలు, బైక్ కండీషన్‌ను మీరే చెక్ చేసుకోవాలి. బైక్ యజమానిని వివరాలు తెలుసుకోకుండా, బైక్‌ను చూడకుండా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొద్దు.

Also read:

Corona Virus: మహారాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే..

Prabhas Adipurush: రాముడికి సీత దొరికింది..! ప్రభాస్‌ సరసన నటించేది ఆ భామే.. వైరల్‌గా మారిన ఫొటోలు..