AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Economy: బలమైన ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతున్న భారత్‌.. 2030 నాటికి ఏకంగా..

030 నాటికి భారత్‌ మరింత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ఈ విషయాన్ని తెలిపింది. 2030 నాటికి 7.3 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగనుందని తెలిపింది. జపాన్‌ను వెనక్కి నెట్టడం ద్వారా ఆసియాలో అదిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుందని S&P గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ తన తాజా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ తన నివేదికలో తెలిపింది. ఇదిలా ఉంటే 2021, 2022లో వేగవంతమైన ఆర్థిక వృద్ధి తర్వాత...

India Economy: బలమైన ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతున్న భారత్‌.. 2030 నాటికి ఏకంగా..
India Economy
Narender Vaitla
|

Updated on: Oct 25, 2023 | 9:50 AM

Share

భారత ఆర్థిక వ్యవస్థ ఓరేంజ్‌లో దూసుకుపోతోంది. జీడీపీ విషయంలో ప్రపంచ అగ్ర దేశాలను వెనక్కినెడుతోంది. భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతుండడం, యువ జనాభా, పట్టణ ఆదాయాలు పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా వృద్ధి చెందుతోంది. ఇప్పటికే భారతదేశం ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే 2030 నాటికి భారత్‌ మరింత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ఈ విషయాన్ని తెలిపింది. 2030 నాటికి 7.3 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగనుందని తెలిపింది. జపాన్‌ను వెనక్కి నెట్టడం ద్వారా ఆసియాలో అదిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుందని S&P గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ తన తాజా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ తన నివేదికలో తెలిపింది. ఇదిలా ఉంటే 2021, 2022లో వేగవంతమైన ఆర్థిక వృద్ధి తర్వాత, భారత ఆర్థిక వ్యవస్థ 2023 ఆర్థిక సంవత్సరంలో బలమైన వృద్ధిని చూపుతూనే ఉంది.

S&P గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అంచనా ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.2 నుంచి 6,3 శాతం పెరగనుందని చెబుతోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 7.8 శాతంగా ఉంది. ఈ లెక్కన ఆర్థిక వ్యవస్థ ఇలాగే వృద్ధిలో కొనసాగితే.. భారత్‌ రెండో స్థానంలోకి రావడం ఖాయంగా తెలుస్తోంది. దేశీయంగా డిమాండ్‌లో బలమైన వృద్ధి కనిపిస్తుండడం సానుకూల అంశమని ఎస్‌ అండ్‌ పీ చెబుతోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశంగా అమెరికా అగ్ర స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత చైనా రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో జపాన్‌ ఉంది. అయితే ప్రస్తుతం భారత్‌లో కనిపిస్తున్న వృద్ధి ఇలాగే కొనసాగితే 2030 నాటికి భారతదేశ జీడీపీ జర్మనీని అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక 2039 నాటికి భారత్‌లో 110 కోట్ల మంది భారతీయులకు ఇంటర్‌నెట్ లభించనుందని, 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రాకవడంతో దేశంలో ఇ-కామర్స్‌ గణనీయంగా 4జీ నుంచి 5జీ సాంకేతికతకు మారడంతో ఇ-కామర్స్‌ గణనీయంగా వృద్ధి చెందనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..