Billionaires: బిలియనీర్లలో భారత్ మూడో స్థానం.. ధనవంతుల్లో ఎక్కువ మంది ఆ నగరాల్లోని వారే..!

Billionaires: ప్రపంచంలో ఎక్కువమంది బిలియనీర్లు(World Billionaires) కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2022 వివరాల ప్రకారం ఇందులో ఆ దేశాలు ముందువరుసలో ఉన్నాయి.

Billionaires: బిలియనీర్లలో భారత్ మూడో స్థానం.. ధనవంతుల్లో ఎక్కువ మంది ఆ నగరాల్లోని వారే..!
Billionaires
Follow us

|

Updated on: Mar 20, 2022 | 10:59 AM

Billionaires: ప్రపంచంలో ఎక్కువమంది బిలియనీర్లు(World Billionaires) కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2022 వివరాల ప్రకారం ఇందులో అమెరికా, చైనాలు ముందువరుసలో ఉన్నాయి. 2021 సంవత్సరంలో దేశంలో 215 మంది బిలియనీర్లు ఉన్నారు. కాగా.. కొత్తగా 58 మంది బిలియనీర్లుగా మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత సంతతికి చెందిన బిలియనీర్లను కలుపుకుంటే ఆ సంఖ్య 249కి చేరుకుంది. ఇందులో ప్రధానంగా ముంబయి నగరంలో(Mumbai City) అత్యధికంగా 72 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ఆ తరువాతి స్థానంలో 51 మందితో దిల్లీ.. 28 మంది బిలియనీర్లతో బెంగళూరు నగరాలు నిలిచాయి. గత సంవత్సరం భారత బిలియనీర్ల సంపద 700 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఈ పెరిగిన విలువ స్విజ్జర్ లాండ్ జీడీపీకి సమానమైనది. అదే యూఏయీ జీడీపీకి రెండితల విలువైనది.

దిగ్గజ వ్యాపారవేత్త అదానీ గత సంవత్సరం సరాసరిన ప్రతి వారం తన ఆస్తిలో రూ. 6000 కోట్లను చేర్చుకుని 49 బిలియన్ డాలర్ల సంపదను కలిగిఉన్నారు. ముకేశ్ అంబానీ తన ఆస్తులను 24 శాతం మేర పెంచుకుని 103 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. సైరస్ పూనావాలా 26బిలియన్ డాలర్లు, కుమార మంగళం బిర్లా 18 బిలియన్ డాలర్లు, నస్లీ వాడియా 7.5 బిలియన్ డాలర్లు, ఇండిగో రాకేశ్ గంగ్వాల్, రాహుల్ భాటియా 4.3, 4.2 బిలియన్ డాలర్లు సంపద కలిగి ఉన్నారు. 16 బిలియన్ డాలర్ల సంపదతో మూడో ధనిక బ్యాంకర్ గా ప్రపంచంలో ఉదయ్ కోటక్ నిలిచారు. సాఫ్ట్ వేర్ వ్యాపారంలో 28 బిలియన్ డాలర్ల ఆస్తితో శివనాడార్ ప్రపంచంలో మూడో బిలియనీర్ గా నిలిచారు.

నైకా వ్యవస్థాపకురాలు ఫాల్గునీ నాయర్ కొత్తగా బిలియనీర్ల జాబితాలోకి చేరారు. ఇదే సమయంలో ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్, ఫ్యూచర్ గ్రూప్ కిశోర్ బియానీ బిలియనీర్ల జాబితా నుంచి కనుమరుగయ్యారు. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3381 మంది బిలియనీర్లు ఉండగా.. అందులో 153 మంది కొత్తగా వచ్చిన వారే.

ఇవీ చదవండి..

Defence Imports: భారత రక్షణ దిగుమతుల్లో రష్యాదే అగ్రస్థానం.. కానీ ఇప్పుడు సీన్ మారుతోందా..!

Gold Reserves: బంగారం నిల్వలు ఏ దేశం దగ్గర ఎక్కువ ఉన్నాయి.. భారత్ కొత్తగా ఎంత గోల్డ్ కొందంటే..