Gas Cylinder Booking: పేటీఎం బంపర్‌ ఆఫర్‌.. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తే మూడు నెలల పాటు క్యాష్‌బ్యాక్‌

Paytm Cashback Offer: గ్యాస్ సిలిండర్ ధర ఇటీవల నుంచి భారీగా పెరిగిపోతోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ ధర మొత్తం రూ.190.5 పెరిగింది. అంటే..

Gas Cylinder Booking: పేటీఎం బంపర్‌ ఆఫర్‌.. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తే మూడు నెలల పాటు క్యాష్‌బ్యాక్‌
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 06, 2021 | 6:31 AM

Paytm Cashback Offer: గ్యాస్ సిలిండర్ ధర ఇటీవల నుంచి భారీగా పెరిగిపోతోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ ధర మొత్తం రూ.190.5 పెరిగింది. అంటే సుమారు రూ.200 ధర ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే రూ.937 చెల్లించాలి. ఇంకొన్ని రోజులలో సిలిండర్ ధర రూ.1,000 దాటినా ఆశ్చర్యం పోనవసరం లేదు. ఇలా గ్యాస్ సిలిండర్ సామాన్యులకు భారం అవుతున్న సమయంలో పేటీఎం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. పేటీఎం యాప్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఇలా ఒక్కసారి కాదు.. మూడు నెలలపాటు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం రూ.2,700 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. ‘3 పే 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్’ పేరుతో ఈ ఆఫర్ అందిస్తోంది పేటీఎం.

పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఖచ్చితంగా రూ.900 క్యాష్‌బ్యాక్ వస్తుందని చెప్పలేం. రూ.900 లోపు ఎంతైనా క్యాష్‌బ్యాక్ రావచ్చు. అయితే ఎంత క్యాష్‌బ్యాక్ వచ్చినా కస్టమర్లకు లాభమే. గతంలో ఈ క్యాష్‌బ్యాక్ తక్కువగా ఉండేది. కానీ క్యాష్‌బ్యాక్‌ను రూ.900 చేస్తూ కొత్త ఆఫర్ ప్రకటించింది. గతంలో మొదటిసారి బుక్ చేసినవారికి మాత్రమే క్యాష్‌బ్యాక్ వచ్చేది. ఇప్పుడు ‘3 పే 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్’లో మూడుసార్లు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ కస్టమర్లు పేటీఎంలో ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పాటు పేటీఎం పోస్ట్‌పెయిడ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసే అవకాశం కల్పిస్తోంది పేటీఎం. డబ్బులు లేకపోయినా గ్యాస్ సిలిండర్ బుక్ చేసి తర్వాత నెలలో డబ్బులు చెల్లించవచ్చు. ఇక ఇప్పటికే పేటీఎంలో గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నవారికి ప్రతీ బుకింగ్‌పై 5000 క్యాష్‌బ్యాక్ పాయింట్స్, రివార్డ్స్ లభిస్తాయి.

పేటీఎంలో గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలంటే..

1- ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేయాలి. 2- హోమ్ స్క్రీన్‌లో Book Gas Cylinder ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. 3- ఆ తర్వాత మీ గ్యాస్ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఎల్‌పీజీ ఐడీ లేదా కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. 4- సెర్చ్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి. 5- ఓసారి వివరాలు కన్ఫామ్ చేసుకొని బుకింగ్ పైన క్లిక్ చేయాలి. 6- పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయాలి. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 7- పేమెంట్ పూర్తి చేసిన తర్వాత గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది. ట్రాకింగ్ ద్వారా స్టేటస్ చెక్ చేయవచ్చు. 8- స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ చేస్తే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Tata Motors Outlets: ఒకే రోజు కొత్తగా 70 ఔట్‌లెట్లను ప్రారంభించిన టాటా మోటార్స్‌..!

Google Pay FD: ఎలాంటి బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై స్పందించిన గూగుల్‌ పే