Google Pay FD: ఎలాంటి బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై స్పందించిన గూగుల్‌ పే

Subhash Goud

Subhash Goud |

Updated on: Sep 04, 2021 | 12:56 PM

Google Pay: టెక్‌ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్‌ పే తాజాగా ఫిక్సిడ్‌ డిపాజిట్లు కూడా ఆఫర్‌ చేస్తోందన్న వస్తున్న వార్తల నేపథ్యంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలను..

Google Pay FD: ఎలాంటి బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై స్పందించిన గూగుల్‌ పే
Follow us

Google Pay: టెక్‌ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్‌ పే తాజాగా ఫిక్సిడ్‌ డిపాజిట్లు కూడా ఆఫర్‌ చేస్తోందన్న వస్తున్న వార్తల నేపథ్యంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలను నేరుగా ప్రస్తావించకుండా.. తాము సంస్థలతో భాగస్వామ్యం ద్వారానే భారత్‌లో సర్వీసులు అందిస్తున్నామని గూగుల్‌ పే స్పష్టం చేసింది. పలు సందర్భాలలో కొన్ని ఆఫర్లను తామే స్వయంగా అందిస్తున్నామనే వార్తలు వస్తున్నాయని, అవి వాస్తవం కాదని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. చాలా వ్యాపారాలు కొత్త వినియోగదారులకు చేరువయ్యేందుకు తమ ప్లాట్‌ఫాం ఒక మాధ్యమంగా ఉపయోగపడుతోందని గూగుల్‌ పేర్కొంది.

కాగా, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో డిజిటల్‌గా ఫిక్సిడ్‌ డిపాజిట్లు తెరిచే సౌలభ్యాన్ని గూగుల్‌ పే ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఖాతాదారు ప్రత్యేకంగా సేవింగ్స్‌ ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్‌ ఖాతా తెరవకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ చేసే సదుపాయం పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్‌ చేస్తున్నట్టు ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (SFB) ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్‌డీలపై 6.35 శాతం వరకు వడ్డీ ఉంటుందని ఫైనాన్స్‌ బ్యాంక్‌ పేర్కొంది. రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ గ్యారంటీ ఉంటుందని వివరించింది. ఎలాంటి బ్యాంకు ఖాతా లేకుండా గూగుల్‌ పేలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే ప్రక్రియ రెండు నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు.

కాగా, వివిధ బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఇక చిన్న చిన్న బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

RBI Penalty: మరో రెండు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా.. కస్టమర్ల పెట్టుబడులపై ప్రభావం ఉంటుందా..?

Insurance Policy: మీకు మద్యం తాగే అలవాటు ఉండి బీమా పాలసీ తీసుకుంటున్నారా..? ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోండి

Low CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే లోన్‌ పొందడం ఎలా..? రుణంకు స్కోర్‌కు సంబంధం ఏమిటి..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu