AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union budget: కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..? పెరుగుతున్న అంచనాలు

పార్లమెంటులో ప్రవేశపెట్టే యూనియన్ బడ్జెట్ కోసం దేశంలోని ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. దానిలో అందజేసే పన్ను మినహాయింపులు, రాయితీలు తదితర వాటి కోసం లెక్కలు వేసుకుంటారు. తద్వారా ఆదాయంలో కొంత మిగుల్చుకోవాలని భావిస్తారు. కేంద్రం కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా పలు రాయితీ కల్పిస్తుంది. ప్రస్తుతం దేశంలో కేంద్ర బడ్జెట్ పై వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. దానిలో కల్పించే మినహాయింపులపై అనేక వార్తలు వస్తున్నాయి.

Union budget: కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..? పెరుగుతున్న అంచనాలు
Budget
Nikhil
|

Updated on: Jan 11, 2025 | 3:06 PM

Share

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్ డీఏ ప్రభుత్వం మూడో సారి కేంద్రంలో అధికారం చేపట్టింది. అనంతరం తొలి బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఫిబ్రవరిలో రెండోసారి తీసుకురానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెడతారని సమాచారం. అయితే దీన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. 2047 నాటికి వీక్షిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుgదని భావిస్తున్నారు. బడ్జెట్ లో అందించే మినహాయింపులపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెబుతారని సమాచారం. కొత్త పన్ను విధానంలో మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతారని భావిస్తున్నారు. పన్ను రేట్ల తగ్గించి సామాన్యులకు ఊరట లభిస్తుందని చెబుతున్నారు.

పన్ను మినహాయింపు పరిమితిని రూ.50 వేలకు, పెద్దలకు రూ.లక్ష కు పెంచే ప్రతిపాదన ఉంది. బీమా వ్యాప్తిని ప్రోత్సహించేందుకు కొత్త పన్ను విధానంలో80 డి సెక్షన్ ను చేర్చుతారు. ఎందుకంటే ఆ సెక్షన్ కింద ఉన్న మినహాయింపులను చాన్నాళ్లుగా మార్చలేదు. ప్రస్తుతం పెరుగుతున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో బీమాను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటారు. హౌసింగ్ రుణాలపై వడ్డీ మినహాయింపు పెరిగే అవకాశం ఉంది. సెక్షన్ 24బీ కింద ఈ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలు స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు పెరుగుతాయి. దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ముందుకు పయనించే అవకాశం కలుగుతుంది.

మధ్య తరగతి ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి పన్ను శ్లాబ్ లలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయవచ్చు. వీటి ద్వారా వారి ఆదాయం పెరిగి, పొదుపు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఆర్ అండ్ డీలో ప్రైవేటు పెట్టుబడిని ప్రోత్సహించడానికి కొత్త పథకం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. క్రిప్టో కరెన్సీ, నాన్ ఫంగబుల్ టోకెన్ల (ఎన్ఈటీ)పై పన్ను విధించే స్పష్టమైన మార్గదర్శకాలను బడ్జెట్ లో చేర్చుతారు. మూలధనం ఆస్తులకు సంబంధించి హోల్డింగ్ వ్యవధిని 36 నెలల నుంచి 24 నెలలకు తగ్గించే అవకాశం ఉంది. అలాగే ఐపీవో ఆఫర్స్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో అన్ లిస్టెడ్ షేర్ల హెల్డింగ్ వ్యవధిని రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి