Income Tax Refund: 2.26 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు రీఫండ్‌.. మీకు వచ్చిందా? లేదా చెక్‌ చేసుకోండిలా!

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021-22 మార్చి 20 వరకు 2.26 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ. 1.93 లక్షల..

Income Tax Refund: 2.26 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు రీఫండ్‌.. మీకు వచ్చిందా? లేదా చెక్‌ చేసుకోండిలా!
Follow us

|

Updated on: Mar 24, 2022 | 8:51 PM

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021-22 మార్చి 20 వరకు 2.26 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ. 1.93 లక్షల కోట్ల పన్ను వాపసు జారీ చేసింది . ఆదాయపు పన్ను (Income Tax) శాఖ ప్రకారం.. వీటిలో రూ. 38,447.27 కోట్ల విలువైన 1.85 కోట్ల రీఫండ్‌లు 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి (మార్చి, 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరం) ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఏప్రిల్ 1, 2021 నుండి మార్చి 20, 2022 వరకు 2.26 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ. 1,93,720 కోట్ల రీఫండ్‌లను జారీ చేసిందని ఆదాయపు పన్ను శాఖ గురువారం ఒక ట్వీట్‌ తెలిపింది.

ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను వాపసు రూ. 70,977 కోట్లు, కార్పొరేట్ పన్ను రీఫండ్ రూ. 1,22,744 కోట్లు ఉంది. మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ వచ్చిందా లేదా అనే ప్రశ్న మీ మనసులో ఉంటే మీరు ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో సులభంగా తనిఖీ చేయవచ్చు. అయితే ఒకవేళ మీరు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఇంకా రీఫండ్ రాకపోయినట్టయితే.. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్‌సైట్ రాకతో ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం చాలా సులభం పేపర్‌లెస్‌గా మారింది. అయితే ఆదాయపు పన్ను దాఖలుకు చివరి తేదీ సమీపిస్తోంది. మీరు ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయకుంటే చివరి తేదీ 31 మార్చి 2022లోపు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పెనాల్టీతో రిటర్న్ దాఖలు చేయవచ్చు.

ఆదాయపు పన్ను రీఫండ్‌ను చెక్‌ చేయడం ఎలా..?

☛ ఆదాయపు పన్ను వెబ్‌సైట్ కి వెళ్లి మీ పాన్, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా ఖాతాకు లాగిన్ అవ్వండి.

☛ ఆ తర్వాత ఈ-ఫైల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇ-ఫైల్ ఎంపిక కింద ఆదాయపు పన్ను రిటర్న్స్‌ని ఎంచుకుని, ఆపై వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ ఎంపికపై క్లిక్ చేయండి.

☛ ఆపై, మీరు దాఖలు చేసిన తాజా ITRని తనిఖీ చేయండి. తర్వాత, మీరు ITR ఫైల్ చేసిన స్థితి కనిపిస్తుంది. ఇందులో, మీరు పన్ను రీఫండ్ జారీ చేసిన తేదీ, రీఫండ్ మొత్తం, ఈ సంవత్సరానికి సంబంధించి ఏదైనా రీఫండ్ బకాయి ఉన్న తేదీ కూడా కనిపిస్తుంది.

NSDL వెబ్‌సైట్‌లో..

ఆదాయపు పన్ను రిఫండ్‌ను ట్రాక్ చేయడానికి మరొక మార్గం NSDL వెబ్‌సైట్‌ కూడా ఉంది. ఈ వెబ్‌సైట్‌లో పన్ను చెల్లింపుదారు రీఫండ్ బ్యాంకర్‌కు అసెస్సింగ్ అధికారి పంపిన 10 రోజుల తర్వాత మాత్రమే రిఫండ్‌ స్థితిని తనిఖీ చేయగలరని గమనించాలి.

☛ ముందుగా https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.htmlకి వెళ్లండి.

☛ ఆ తర్వాత మీ పాన్ వివరాలను పూరించండి. ఆపై, మీరు రిఫండ్‌ స్థితిని తనిఖీ చేయాలనుకుంటున్న అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోండి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అసెస్‌మెంట్ సంవత్సరం 2021-22గా ఉంటుంది.

☛ చివరగా క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయండి. మీ రీఫండ్ స్థితి ఆధారంగా మీ స్క్రీన్‌పై సందేశం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

April Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో బ్యాంకులకు వరుస సెలవులు

LIC Policy Holders: ఎల్‌ఐసీలో అలాంటి పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. మార్చి 25 చివరి తేదీ