AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GIG Workers: గిగ్ వర్కర్లు అంటే ఎవరో తెలుసా.. వారు ఆదాయపు పన్ను కట్టాలా..

చాలా మందికి గిగ్ వర్కర్లు(GIG Workers) అంటే ఎవరో తెలియదు. గిగ్ వర్కర్లు అంటే గిగ్ వర్కర్లు అంటే బుకింగ్‌పై పని చేసేవారు. స్టాండప్ కమెడియన్లు, రచయితలు ఎవరైనా ఈ కేటగిరీలోకి రావచ్చు...

GIG Workers: గిగ్ వర్కర్లు అంటే ఎవరో తెలుసా.. వారు ఆదాయపు పన్ను కట్టాలా..
Income Tax
Srinivas Chekkilla
|

Updated on: Mar 25, 2022 | 6:45 AM

Share

చాలా మందికి గిగ్ వర్కర్లు(GIG Workers) అంటే ఎవరో తెలియదు. గిగ్ వర్కర్లు అంటే గిగ్ వర్కర్లు అంటే బుకింగ్‌పై పని చేసేవారు. స్టాండప్ కమెడియన్లు, రచయితలు ఎవరైనా ఈ కేటగిరీలోకి రావచ్చు. దేశంలో దాదాపు 1.5 కోట్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య షార్ట్ టర్మ్, మిడి టర్మ్‌లో దాదాపు 24 మిలియన్లు కాగా, లాంగ్‌టర్మ్‌లో 90 మిలియన్ గిగ్ వర్కర్లు ఆర్థిక వ్యవస్థలో భాగమవుతారు. ఈ గిగ్ వర్కర్ల ఇన్ కం టాక్స్(Income tax) కట్టాలా అంటే వారి ఆదాయాన్ని బట్టి ఉంటుంది. వారికి ఇన్ కం టాక్స్ రిటర్న్ ఫారమ్ 4 అంటే, ITR 4 వారికి సరిపోతుందని తెలుసుకోండి.

ఎందుకంటే గిగ్ వర్కర్ల ఆదాయం కూడా “వ్యాపారం, వృత్తి నుంచి వచ్చే ఆదాయం” స్వయం ఉపాధి వంటిది. ఉదాహరణకు వైద్యులు, న్యాయవాదులు మొదలైనవారు. అయితే వార్షిక ఆదాయంలో 50 శాతానికి సమానమైన ఖర్చులను చూపడం ద్వారా పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గించవచ్చు. ఉదాహరణకు ఒక గిగ్ వర్కర్ ఒక సంవత్సరంలో 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడనుకుందాం. 5 లక్షల రూపాయలను ఖర్చుగా చూపవచ్చు. ఈ ఖర్చులు మీ పరికరాల వినియోగం, కార్యాలయ మరమ్మతులు, అద్దె, టెలిఫోన్ లేదా మొబైల్ బిల్లులు మొదలైన వాటికి సంబంధించినవి కావచ్చు.

ఖర్చులను చూపించిన తర్వాత, గిగ్ కార్మికులు పెట్టుబడి లేదా ఖర్చు చేయడం ద్వారా రూ. 1.50 లక్షల వరకు ఆదాయంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దీని తరువాత మిగిలిన ఆదాయపు పన్ను.. పన్ను విధించదగిన ఆదాయం వర్గంలోకి వస్తుంది. దీనిపై స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అంటే 5 లక్షల వరకు ఆదాయాన్ని వృత్తిపై చేసే ఖర్చులతో భర్తీ చేయవచ్చు. ఆపై ఆదాయపు పన్ను శ్లాబ్‌ను బట్టి గరిష్ఠంగా 30 శాతం వరకు ఉంటుంది.

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సాధారణంగా TDS అనేది గిగ్ వర్కర్లు అందుకున్న చెల్లింపు నుంచి తీసివేస్తారు. TDS తీసివేయకపోతే, ముందస్తు పన్నును సకాలంలో జమ చేసేలా జాగ్రత్త పడండి. లేకపోతే, సెక్షన్ 234B, 234C కింద జరిమానా విధించే నిబంధన ఉంది. మీ ఆదాయంపై పన్ను పడే అవకాశం లేకపోతే, ITR ఫైల్ చేసిన తర్వాత TDS మొత్తం తిరిగి మీకు జమ అయిపోతుంది.

Read also.. Income Tax: పన్ను ఆదా కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఇవి గుర్తుంచుకోండి..