Income Tax: పన్ను ఆదా కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఇవి గుర్తుంచుకోండి..
చాలా మంది ఉద్యోగస్థులు(Employees) కంపెనీ HR డిపార్ట్‌మెంట్‌కు ఇన్వెస్ట్‌మెంట్ల(Investments)కు సంబంధించి సరైన సమాచారం ఇవ్వరు. ఆ తర్వాత చిక్కుల్లో పడుతుంటారు...
చాలా మంది ఉద్యోగస్థులు(Employees) కంపెనీ HR డిపార్ట్‌మెంట్‌కు ఇన్వెస్ట్‌మెంట్ల(Investments)కు సంబంధించి సరైన సమాచారం ఇవ్వరు. ఆ తర్వాత చిక్కుల్లో పడుతుంటారు. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ల వివరాలను అందించాల్సి సమయంలో లేకుంటే జీతంలో నుంచి టాక్స్ కట్ అయ్యే సమయంలో డిడక్షన్స్ కోసం హడావిడిగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంటారు. చివరి క్షణాల్లో చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్(life Insurance) పాలసీల్లో పెట్టుబడులు పెడుతుంటారు. కానీ.. టాక్స్ సేవ్ చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఎంపిక కాదు. చివరి క్షణాల్లో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే.. దాని గురించి మీరు మరోసారి ఆలోచించాలి. చివరికి పాలసీ కొనుగోలు వృధా నిర్ణయంగా మారకూడదు. భవిష్యత్తులో మీ జీవితానికి ఫైనాన్సియల్ సెక్యూరిటీ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ఉత్తమమైన ఎంపికగా చెప్పుకోవాలి. కేవలం టాక్స్ సేవ్ చేసుకోవటం కోసం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో అర్థమే లేదు.
టాక్స్ సేవింగ్ కోసం చాలా సార్లు స్నేహితులు, బంధువుల ఇచ్చే సలహాలతో అనేక మంది ఏదో ఒక దానిలో పెట్టుబడి పెట్టేస్తూ ఉంటారు. కానీ అది తప్పుడు నిర్ణయమని భవిష్యత్తులో తెలుస్తుంది. ఈ కారణంగానే ఇన్సూరెన్స్ కంపెనీలు ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్స్‌లో మంచి వ్యాపారం చేస్తుంటాయి. దాదాపు మూడింట రెండు వంతుల పాలసీలు ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లోనే తీసుకుంటారని తెలుస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వివరాల ప్రకారం.. డిసెంబర్ 2018లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు 18 వేల 237 కోట్ల రూపాయల ప్రీమియంను వసూలు చేశాయి. అదే నెలలో ఇన్సూరెన్స్ సంస్థలు 25 లక్షల15 వేల 697 పాలసీలను అమ్మాయి. 2019 మార్చిలో ఇన్సూరెన్స్ కంపెనీల వ్యాపారం రెండు రెట్లు పెరిగింది. అదే సమయంలో.. ఇన్సూరెన్స్ కంపెనీలు 37 వేల259 కోట్ల రూపాయల ప్రీమియం వసూలు చేసి.. 55 లక్షల 39 వేల196 పాలసీలను విక్రయించాయి. ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం వెనుక ప్రధాన లక్ష్యం పన్ను ఆదాగా తెలుస్తోంది. మీ ఆదాయానికి అనుగుణంగా మీరు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కవర్ తప్పక తీసుకోవాలి. పాలసీ కొనుగోలు అనేది కేవలం మీ ఆర్థిక భద్రత కోసం మాత్రమే అయి ఉండాలి.
ప్రజలు తమ ఆర్థిక భద్రత కోసం బీమా కొనుగోలు చేసేలా ప్రోత్సహించడానికి మాత్రమే ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఆదాయపు పన్ను మినహాయింపు సౌకర్యాన్ని కల్పించిందని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు డాక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కానీ మార్కెట్‌లో ఇది దుర్వినియోగం అవుతోందని ఆయన చెబుతున్నారు. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని మీ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేయాలని ఆయన సూచిస్తున్నారు. మీ వార్షిక ఆదాయానికి అనుగుణంగా టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలని అన్నారు. దీని తరువాత మీ అవసరాలకు అనుగుణంగా ఇతర ఫైనాన్స్ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన చెబుతున్నారు. కానీ.. టాక్స్ సేవింగ్స్ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయటం మంచి నిర్ణయం కాదని వెల్లడించారు.
Read also.. Crude Oil: భారత్‌లో ముడి చమురు ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది.. నిపుణులు ఏం చెబుతున్నారు..