AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crude Oil: భారత్‌లో ముడి చమురు ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది.. నిపుణులు ఏం చెబుతున్నారు..

ముడి చమురు(Crude oil)పై ఆధారపడిన దేశాల్లో భారత్‌ ప్రధామైన దేశం. ఎందుకంటే భారత్ తన చమురు వినియోగంలో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది...

Crude Oil: భారత్‌లో ముడి చమురు ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Crude oil
Srinivas Chekkilla
|

Updated on: Mar 24, 2022 | 6:43 PM

Share

ముడి చమురు(Crude oil)పై ఆధారపడిన దేశాల్లో భారత్‌ ప్రధామైన దేశం. ఎందుకంటే భారత్ తన చమురు వినియోగంలో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. దేశంలో ముడి చమురు ఉత్పత్తి తగ్గుతున్నందున దిగుమతులపై ఆధారపడటం తప్పనిసరిగా మారింది. 2020-21 సంవత్సరంలో దేశంలో మొత్తం 29.91 మిలియన్ టన్నుల చమురు ఉత్పత్తి అయింది. గతేడాదితో పోలిస్తే ఇది 0.14 మిలియన్‌ టన్నులు తక్కువ. కోవిడ్(covid) పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయని కంపెనీలు వాదించవచ్చు. కానీ చమురు బావుల మూసివేత, క్షేత్ర అభివృద్ధి కార్యకలాపాలు మందగించడం వంటి కారణాలతో చమురు ఉత్పత్తి తగ్గిపోయిందని కేర్ రేటింగ్స్(Care Ratings) నివేదిక చెబుతోంది. చమురు ఉత్పత్తి తగ్గడం అనేది గత ఏడాది మాత్రమే కాదు. గత ఏడేళ్లుగా ఈ తగ్గుదల కొనసాగుతోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా కంపెనీలు తమ నిర్ణీత ఉత్పత్తి లక్ష్యాల కంటే వెనుకబడి ఉన్నాయి. చమురు మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తున్న నిపుణులు ఈ వెనుకబాటుకు అసలు కారణాన్ని వివరిస్తున్నారు. కొత్త చమురు వనరులను కనుగొనే పని వేగంగా జరగడం లేదని చెబుతున్నారు. ఒకవేళ ఎక్కడన్నా కొత్త చమురు వనరు కనిపెట్టినా వాటి పెట్టుబడులు పెట్టడం లేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం చమురు ఉత్పత్తి చాలావరకు పాత వనరుల సహాయంతోనే జరుగుతోంది. కాలక్రమేణా వాటి చమురు ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గింది. దేశీయ కంపెనీలు కొత్త వనరులపై పని చేయకుండా ఇప్పటికే ఉన్న వాటి నుంచి మరింత ఉత్పత్తి చేయడం ఎలా అనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నాయి.

ఉత్పత్తిని పెంచడానికి, దేశంలోని పెద్ద ప్రభుత్వ కంపెనీలు ఇప్పుడు లోతైన సముద్రంలో కొత్త వనరులను కనుగొనవలసి ఉంటుంది. అలాగే కనుగొన్న వనరులపై పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి కోసం కంపెనీల వద్ద తగినంత వనరులు కూడా అందుబాటులో ఉన్నాయి. ONCG 2021 సంవత్సరంలో రూ. 1,91,000 కోట్ల కంటే ఎక్కువ నిల్వలను కలిగి ఉంది. ఆయిల్ ఇండియా కూడా 22,000 కోట్లకు పైగా నిల్వలను కలిగి ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగిపోవడంతో ఆయా కంపెనీలకు భారీ లాభాలు వస్తున్నాయి. ప్రభుత్వానికి భారీ డివిడెండ్ వస్తుంది. 2021 సంవత్సరంలో ONGC ప్రభుత్వానికి 26,077 కోట్ల రూపాయల డివిడెండ్ ఇచ్చింది.

ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ.. చమురు అన్వేషణ.. ప్రైవేట్, విదేశీ కంపెనీల ఉత్పత్తిపై ఆసక్తి చూపకపోవడానికి కారణాలుగా తెలుస్తోంది. బ్లాక్‌ను కేటాయించిన తర్వాత కూడా ప్రారంభించడానికి ముందు ఇతర అనుమతులకు పట్టే సమయం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ ప్రక్రియ సగటున 5 నుంచి 7 సంవత్సరాల సమయం పడుతుంది. ఉత్పత్తిని ప్రారంభించడానికి ముందు, పర్యావరణ క్లియరెన్స్..సర్వే అలాగే ఫీల్డ్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను సమర్పించడం ద్వారా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఆమోదం కూడా పొందాలి. మొత్తంమీద చమురు మార్కెట్లో స్వయం సమృద్ధి సాధించే మార్గం కొంచెం క్లిష్టంగా ఉంది.

Read also..  Stock Market: వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 89, నిఫ్టీ 23 పాయింట్లు డౌన్..