SCSS Scheme: ఆ పథకంలో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే లాభాల పంట.. ఏడాదికి రూ.2,46,000 రాబడి
సాధారణంగా సీనియర్ సిటిజన్‌లు వారి రోజు వారీ అవసరాలకు సరైన ఆదాయం అవసరమని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రత్యేక రాబడి సాధారణ ఖర్చులు లేదా వైద్య అవసరాలకు సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఇండిపెండెంట్‌గా ఉండాలనుకునే ఈ ఆదాయ వనరులు చాలా సాయం చేస్తాయి. ఈ ఖర్చులను తీర్చడానికి ఉత్తమమైన పరిష్కారాల్లో ఒకటి పెన్షన్ లేదా పొదుపు పథకం.

సాధారణంగా సీనియర్ సిటిజన్‌లు వారి రోజు వారీ అవసరాలకు సరైన ఆదాయం అవసరమని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రత్యేక రాబడి సాధారణ ఖర్చులు లేదా వైద్య అవసరాలకు సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఇండిపెండెంట్‌గా ఉండాలనుకునే ఈ ఆదాయ వనరులు చాలా సాయం చేస్తాయి. ఈ ఖర్చులను తీర్చడానికి ఉత్తమమైన పరిష్కారాల్లో ఒకటి పెన్షన్ లేదా పొదుపు పథకం. ఈ పథకాలల్లో ఒకేసారి పెట్టుబడి పెట్టి వడ్డీ రూపంలో రాబడిని పొందవచ్చు. అలాంటి ఆదాయం ఒకరి పెట్టుబడిని బట్టి స్థిరంగా ఉంటుంది. కాబట్టి, సీనియర్ సిటిజన్లు తమ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయానికి అనుగుణంగా తమ జీవనశైలిని సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు మేలు చేసే ఆదాయం వనరుల గురించి తెలుసుకుందాం.
సీనియర్ సిటిజన్ల పెట్టుబడి పథకాలు మార్కెట్-లింక్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల మంచి రాబడిని సీనియర్ సిటిజన్‌లు వడ్డీ రూపంలో పొందవచ్చని పేర్కొంటున్నారు. అలాంటి స్కీమ్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అని చెబుతున్నారు. ఇది పోస్ట్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్, అలాగే ఈ స్కీమ్ చాలా బ్యాంకులు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్‌లు ఒక సారి పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఐదు సంవత్సరాలకు త్రైమాసిక పెన్షన్‌ను పొందవచ్చు. అలాగే ఈ పథకం మెచ్యూరిటీ సమయంలో వారు తమ అసలు మొత్తాన్ని తిరిగి పొందుతారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా సంవత్సరానికి రూ. 2,46,000 ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే ఎలా సంపాదించాలో? చూద్దాం.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా వార్షిక వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంటుంది. ఇది సుకన్య సమృద్ధి యోజన (SSY) తర్వాత అన్ని పోస్టాఫీసు పథకాలలో రెండోది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 55 ఏళ్లు పైబడిన మరియు 60 ఏళ్లలోపు రిటైర్డ్ సివిల్ ఉద్యోగులు, 50 ఏళ్లు పైబడిన, 60 ఏళ్లలోపు రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌సీఎస్ఎస్‌లో కనిష్ట వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 30 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్‌సీఎస్ఎస్‌లో పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి.
ఎస్‌సీఎస్‌ఎస్ ద్వారా సంవత్సరానికి రూ. 2,46,000 పొందాలంటే ఈ పథకంలో 30 లక్షల రూపాయలను ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. 8.2 శాతం వడ్డీ రేటుతో, ఒక త్రైమాసికంలో రూ. 61,500 త్రైమాసిక వడ్డీ మొత్తాన్ని పొందుతారు. నాలుగు త్రైమాసికాల్లో లేదా పూర్తి సంవత్సరంలో, ఒకరికి రూ.2,46,000 లభిస్తుంది. ఒకరు పూర్తి ఐదేళ్లపాటు కొనసాగితే వారి ప్రారంభ పెట్టుబడి రూ. 30 లక్షలపై రూ. 12 లక్షల రాబడిని పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..








